AP 10th Class Exams: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నేడు పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి భయాలూ లేకుండా విద్యార్థులంతా చక్కగా పరీక్షలు రాయాలని, మంచి ఫలితాలు సాధించాలని లోకేశ్ ఆకాంక్షించారు. ప్రతి ఒక్క విద్యార్థి సకాలంలో పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవాలని, ఎలాంటి ఒత్తిడికీ గురి కాకుండా ఎగ్జామ్స్ రాయాలని ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు.
Read Also: TTD Schools: టిటిడి విద్యాసంస్థల్లో ‘స్మార్ట్’ చదువులకు బాబు ఆదేశం

సోషల్ మీడియా వేదికగా సందేశం
సంవత్సరం పాటు పడిన కష్టానికి సరైన ప్రతిఫలం వచ్చే సమయం ఇదేనని అన్నారు. ప్రశాంతంగా ఉండాలని, పరీక్ష కేంద్రాల్లో సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని లోకేశ్ చెప్పారు. సమయాన్ని వృథా కాకుండా టైమ్ మేనేజ్మెంట్ చేయాలని, సకాలంలో అన్ని ప్రశ్నలకూ సమాధానాలు రాసేలా దాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రణాళికాబద్ధంగా పరీక్షలు రాయండి. విజయం మీదే. ఆల్ ది బెస్ట్’ అని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. విద్యార్థులు తమ పూర్తి ప్రతిభను కనబరిచి మంచి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: