📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

AP 10th Class Exams: ఏప్రిల్ 4 నుంచి పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం

Author Icon By Saritha
Updated: March 17, 2026 • 5:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

AP 10th Class Exams: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు మార్చి 16 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. మార్చి 30వ తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. మొత్తం 3,415 పరీక్ష కేంద్రాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య పరీక్షలు జరుగుతున్నాయి. 210 సమస్యాత్మక కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఒక్కో పరీక్షకు మధ్య సెలవులు వచ్చేలా ఈ సారి టైం టేబుల్ రూపొందించారు.

Read Also: EAPCET: ఏపీ ఈఏపీసెట్‌ 2026 దరఖాస్తు గడువు పొడిగింపు

AP 10th Class Exams: Evaluation of 10th Grade Answer Sheets from April 4

ఏప్రిల్ 13వ తేదీ వరకు జవాబు పత్రాల మూల్యాంకనం

ఇక పరీక్షలు పూర్తయ్యాక ఏప్రిల్ 4వ తేదీ నుంచే పదో తరగతి జవాబు పత్రాలను మూల్యాంకనం చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్‌ కూడా తయారు చేసింది. షెడ్యూల్‌ ప్రకారం టెన్త్ జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 13వ తేదీ వరకు ఆయా రోజుల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 26 జిల్లాల్లో మూల్యాంకన కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటికి క్యాంపు అధికారులుగా ఆయా జిల్లాల విద్యాధికారులు ఉంటారు.

ఇక మూల్యాంకనం చేయనున్న ఒక్కో అసిస్టెంట్‌ ఎగ్జామినర్‌కు రోజుకు కేవలం 40 చొప్పున మాత్రమే జవాబుపత్రాలు మూల్యాంకనం చేసేందుకు ఇస్తారు. అనంతరం మార్కుల లెక్కింపులో తప్పులు జరగకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు ట్యాబ్‌లలో వాటిని నమోదు చేసే విధానం తీసుకొస్తున్నారు. మొత్తం 10 రోజుల పాటు మూల్యాంకనం ప్రక్రియ కొనసాగుతుంది. అనంతరం మార్కుల నమోదు ప్రక్రియ మరో 10 రోజుల్లో పూర్తి చేసి ఏప్రిల్ నెల చివరి వారం నాటికి పదో తరగతి ఫలితాలు వెల్లడించాలని అధికారులు భావిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh AP 10th class exams 2026 AP SSC exams education Paper Valuation Date

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.