AP 10th Class Exams 2026: ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల భవిష్యత్తుకు కీలకమైన పదో తరగతి (SSC) పరీక్షలు నేడు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ విద్యా సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న లక్షలాది మంది విద్యార్థులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులంతా ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంత చిత్తంతో పరీక్షలు రాయాలని ఆయన ఆకాంక్షించారు.
Read Also: Srisailam: శ్రీశైలంలో నేటి నుంచే ఉగాది ఉత్సవాలు
విద్యార్థులే రాష్ట్ర భవిష్యత్తు: ‘ఎక్స్’ వేదికగా జగన్ సందేశం
ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా జగన్ స్పందిస్తూ స్పందిస్తూ, విద్యార్థులే రాష్ట్ర భవిష్యత్తు అని పేర్కొన్నారు. పరీక్షల సమయంలో ఒత్తిడికి లోనుకాకుండా ఏకాగ్రతతో ఉండాలని, తమపై తాము నమ్మకం ఉంచి కష్టపడితే కచ్చితంగా విజయం లభిస్తుందని భరోసా ఇచ్చారు. ప్రతి విద్యార్థి తన పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించాలని ఆయన సూచించారు.
మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా పరీక్షల కోసం విద్యాశాఖ పటిష్ఠమైన ఏర్పాట్లు చేసింది. పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా ఉంచడంతో పాటు, విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: