📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్

Latest News: AP: బిసి స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత సివిల్స్ కోచింగ్కు 100మంది ఎంపిక

Author Icon By Saritha
Updated: December 11, 2025 • 11:07 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సచివాలయం : బిసి స్టడీ(AP) సర్కిల్ ద్వారా ఉచిత సివిల కోచింగ్కు 100 మంది ఎంపిక అయినట్లు రాష్ట్ర బిసి, ఇబిసి, సంక్షేమం, చేనేత, జౌళి శాఖామంత్రి ఎస్. సవిత(S. Savitha) తెలిపారు. స్క్రీనింగ్ పరీక్షకు హాజరయ్యేందుకు 864మంది దరఖాస్తు చేసుకోగా, 723మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారని, వారిలో మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రాతిపదికన 100 మందిని ఎంపిక చేయడం జరిగిందన్నారు.12వ తేదిన గొల్లపూడిలోని బిసి స్టడీ సర్కిల్లో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్లను పరిశీలించడం, 14వ తేది నుండి హైదారాబాద్కు ఇనిస్టిట్యూట్ వారిచే శిక్షణా తరగతులు ప్రారంభమవుతాయని మంత్రి తెలిపారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిసి విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం బిసి స్టడీ సర్కిళ్ళ ద్వారా ఉచితంగా శిక్షణా తరగతులు నిర్వహిస్తుందన్నారు. 2025-26ఏడాదికి సివిల్ సర్వీసెస్ కోచింగ్ కు ఈనెల 7న రాష్ట్రంలోని 7జిల్లాల్లో స్త్రీ నింగ్ టెస్ట్ నిర్వహించడం జరిగిందన్నారు.

Read also: 13న హైదరాబాద్ లో లియోనెల్ మెస్సీ సందడి

ఉచిత సివిల్స్ కోచింగ్‌కు ర్యాంకుల ప్రకటన

ఎంపికైన(AP) వారిలో బిసీలకు 66శాతం, ఎస్సీలకు 20శాతం, ఎస్టీలకు 14శాతం రిజర్వేషన్ కల్పించామన్నారు. మహిళా అభ్యర్థులకు 33శాతం రిజర్వేషన్ కూడా కల్పించడం జరిగిందన్నారు. బిసి స్టడీ సర్కిల్ ద్వారా సివిల్ సర్వీసెస్ కోచింగ్కు ఎంపికైన అభ్యర్థుల్లో ప్రతిభ చూపిన మొదటి మూడు స్థానాల్లో నిలిచిన అభ్యర్థుల వివరాలు పురుష అభ్యర్థుల్లో డి. శ్రీనాథ్ నెల్లూరు 94 మార్కులతో మొదటి ర్యాంకు, ఎ. వెంకటదుర్గ గణేష్, కృష్ణా 91 మార్కులతో రెండో ర్యాంకు, 90 మార్కులు సాధించిన ఎం. ఏడుకొండలు ప్రకాశం, ఎస్. తాతయ్య పశ్చిమ గోదావరి, వై. వేణుగోపాల్ కర్నూలు, జి.కోటేశ్వరరావు ప్రకాశం, 3వ ర్యాంకు సాధించారు. మహిళా అభ్యర్థుల్లో సత్యసాయి జిల్లాకు చెందిన కె.జి. శాంతమ్మ 89 మార్కులతో మొదటి ర్యాంకు, తూర్పు గోదావరి కి చెందిన కె. జ్యోతిశ్రీ 2 వ ర్యాంకు, సత్యసాయి జిల్లా కీర్తిసాయి 84 మార్కులు, అనంతపురం జిల్లాకు చెందిన లలిత జ్యోతి, ప్రకాశం జిల్లా జి.పూజ లు మూడో ర్యాంకు సాధించారు. రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.సత్యనారాయణ, అదనపు సంచాలకులు చంద్రశేఖర్రాజు, జాయింట్ డైరెక్టర్ తనూజరాణి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Andhra Pradesh BC Study Circle Free Civil Services Coaching Latest News in Telugu merit selection Minister S. Savita reservation policy Telugu News training program

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.