📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Vizag Anti Drug Park: వైజాగ్ లో “యాంటీ డ్రగ్ పార్క్”

Author Icon By Sudheer
Updated: June 2, 2025 • 4:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విశాఖపట్నంలో సరికొత్త ఆవిష్కరణకు ఏపీ ప్రభుత్వం (AP Govt) సిద్ధమవుతోంది. విఎంఆర్డిఏ ఆధ్వర్యంలో “యాంటి డ్రగ్ పార్క్” (Anti Drug Park) ఏర్పాటు చేయనున్నట్లు చైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. సెంట్రల్ పార్క్‌లోని రెండు ఎకరాల భూమిలో మూడు కోట్ల పైచిలుకు వ్యయంతో ఈ పార్క్ నిర్మాణం జరగనుంది. డ్రగ్స్‌ దుర్వినియోగం పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజల్లో, ముఖ్యంగా యువతలో, అవగాహన పెంచడం లక్ష్యంగా ఈ పార్క్ ప్రణాళిక రూపొందించారు. దేశంలోనే తొలిసారిగా ఈ తరహా పార్క్‌ను ఏర్పాటు చేయడం విశేషం.

డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలను యువతకు తెలియజేసి కౌన్సిలింగ్ కేంద్రాలు

ఈ పార్క్‌లో డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలను యువతకు స్పష్టంగా తెలియజేసేందుకు ప్రత్యేక కౌన్సిలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే మాదక ద్రవ్యాలకు బానిసలైనవారికి పునరావాస సదుపాయాలుగా కూడా ఈ పార్క్ పనిచేయనుంది. “పార్క్ ఆఫ్ లైఫ్” కాన్సెప్ట్‌తో డ్రగ్‌లేని జీవితం ఎంత అందంగా, శాంతంగా ఉంటుందో అనుభవపూర్వకంగా చూపించబోతున్నారు. పచ్చదనం, విద్యుత్ కాంతుల మొక్కలు, రంగురంగుల చెట్లు, సీతాకోకచిలుకల మోడల్స్, వాటర్ ఫౌంటెన్స్ వంటి అంశాలు ఈ పార్క్‌ను మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి.

సిటీ సెంట్రల్ పార్క్‌కు వచ్చే ప్రతి ఒక్కరూ ఈ పార్క్‌ను సందర్శించేలా మోటివేషన్

ఈ యాంటి డ్రగ్ పార్క్ యువతకు ఒక బలమైన సందేశాన్ని అందించడమే కాకుండా, విశాఖపట్నం నగరానికి మరో కొత్త ఆకర్షణగా మారనుంది. సిటీ సెంట్రల్ పార్క్‌కు వచ్చే ప్రతి ఒక్కరూ ఈ పార్క్‌ను సందర్శించేలా మోటివేషన్ కార్యక్రమాలు చేపడతామని విఎంఆర్డిఏ తెలిపింది. యువగళం పాదయాత్రలో ఈ ఆలోచనకు బీజం పడగా, ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని నిలబెట్టుకుంటున్నామని ప్రణవ్ గోపాల్ అన్నారు. వియత్నామ్ వంటి దేశాలలో మాదక ద్రవ్యాలపై ప్రజల చైతన్యానికి ఇటువంటి ప్రయత్నాలు ఎంతో ఫలప్రదంగా మారిన దృష్ట్యా, ఈ యాంటి డ్రగ్ పార్క్ కూడా మంచి మార్పు తీసుకురాగలదని భావిస్తున్నారు.

Read Also : BRS : డల్లాస్ లో బీఆర్ఎస్ రజతోత్సవాలకు కేటీఆర్ హాజరు

Anti Drug Park Google News in Telugu Visakhapatnam's Central Park vizag VMRDA chairperson Pranav Gopal

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.