ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ముఖ్యంగా అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా ప్రజలకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. ఇకపై సత్యసాయి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్‌లో కూడా వందేభారత్ రైలు (Vande Bharat) ఆగనుంది. ఈ మేరకు రైల్వేశాఖ (Department of Railways) కీలక ప్రకటన చేసింది. కలబురగి (గుల్బర్గా)-బెంగళూరు-కలబురగి (గుల్బర్గా) (22231/22232) మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును సత్యసాయి ప్రశాంతి నిలయంలో హాల్ట్ ఇచ్చినట్లు తెలిపారు. జనవరి 2 (2026) నుంచి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్‌లో 2 నిమిషాల పాటూ ఈ రైలు ఆగుతుంది.
Read Also: AP temples: ఏపీ ఆలయాలపై ప్రభుత్వ సర్వే నివేదిక
ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్‌లో కూడా ఆగుతుంది
ఈ మేరకు ఈ రైళ్లు నడిచే వేళల్లో మార్పులు చేసినట్లు ప్రకటించారు.కలబురగి (గుల్బర్గా)-బెంగళూరు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat) (22231) ఉదయం 5:15 గంటలకు కలబురగి (గుల్బర్గా)లో బయలుదేరి.. మధ్యాహ్నం 2 గంటలకు బెంగళూరుకు చేరుకునేది. ఇకపై ఈ రైలు ఉదయం 6:10 గంటలకు గుల్బర్గాలో బయలుదేరుతుంది. వాడికి ఉదయం 6.40 గంటలకు, యాద్గిర్ 6.48 గంటలకు, రాయచూర్ 7.38 గంటలకు,
మంత్రాలయం రోడ్‌కు 7.58 గంటలకు, గుంతకల్లుకు ఉదయం 9 గంటలకు, అనంతపురం ఉదయం 10.03 గంటలకు, ధర్మవరం ఉదయం 11.10 గంటలకు, శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం ఉదయం 11 గంటలకు, యలహంకకు మధ్యాహ్నం 12.28 గంటలకు, ఎస్ఎంవీటీ బెంగళూరుకు మధ్యాహ్నం 14.10 గంటలకు చేరుకుంటుంది.
ఈ రైలు ( 22232) తిరుగు ప్రయాణంలో బెంగళూరు మధ్యాహ్నం 14.40 గంటలకు, యలహంకకు మధ్యాహ్నం 15.05 గంటలకు, శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయానికి సాయంత్రం 16.23 గంటలకు, ధర్మవరం సాయంత్రం 17.33 గంటలకు, గుంతకల్లుకు సాయంత్రం 18.37 గంటలకు, మంత్రాలయం రోడ్డుకు రాత్రి 19.48 గంటలకు, రాయచూర్‌కు రాత్రి 20.18 గంటలకు, యాద్గిర్‌కు రాత్రి 21.03 గంటలకు, వాడికి రాత్రి 22.15 గంటలకు, కలబురగి (గుల్బర్గా) రాత్రి 22.45 గంటలకు చేరుకుంటుంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: