📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

ఏపీలో కొత్తగా మరో 4 లైన్ల రహదారి

Author Icon By Sudheer
Updated: February 15, 2025 • 5:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమలకు భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ప్రతి రోజు వేలాదిగా భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వస్తున్నారు. వీరితో పాటు అనేక దర్శనీయ స్థలాలకు వెళ్లే భక్తుల సంఖ్య కూడా ఎక్కువవుతోంది. ప్రస్తుత రహదారులు ట్రాఫిక్‌ను తట్టుకోలేకపోవడంతో తిరుమలలో ట్రాఫిక్ సమస్య పెరిగిపోతోంది. ముఖ్యంగా బ్రహ్మోత్సవాలు, గరుడసేవ వంటి ప్రత్యేక రోజులలో పరిస్థితి మరింత తీవ్రంగా మారుతోంది. ఈ నేపథ్యంలో టీటీడీ ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు కొత్తగా నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.

రూ.40 కోట్ల వ్యయంతో ఔటర్ రింగ్ రోడ్డు

రూ.40 కోట్ల వ్యయంతో ఔటర్ రింగ్ రోడ్డునుంచి ఆకాశగంగ వరకు ఈ రహదారిని నిర్మించనున్నారు. ప్రస్తుతం భక్తులు పాపవినాశనం, ఆకాశగంగ, జపాలి, వేణుగోపాల స్వామి ఆలయాలకు వెళ్లడానికి నందకం సర్కిల్ లేదా అక్టోపస్ భవనం ముందు నుంచి వెళ్లాల్సి వస్తుంది. గోగర్భం డ్యామ్ నుంచి పాపవినాశనం వరకూ ఉన్న రెండు వరుసల రహదారి తక్కువవడంతో వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పండుగల సమయంలో ట్రాఫిక్ పెరిగి భక్తులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది.

శాశ్వత పరిష్కారంగా టీటీడీ నాలుగు వరుసల రహదారి

ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా టీటీడీ నాలుగు వరుసల రహదారిని నిర్మించాలని నిర్ణయించింది. తొలిదశలో ఔటర్ రింగ్ రోడ్డునుంచి క్షేత్రపాలకుడి ఆలయం మీదుగా నేపాలి చెక్‌పోస్ట్ వరకూ రహదారి నిర్మించనున్నారు. ఈ మార్గంలో కాల్వ ఉన్న కారణంగా వంతెన నిర్మాణాన్ని కూడా ప్రణాళికలో పెట్టారు. రెండో దశలో నేపాలి చెక్ పోస్ట్ నుంచి ఆకాశగంగ వరకూ ఉన్న రహదారిని విస్తరించనున్నారు.

అటవీ శాఖ అనుమతులు తప్పనిసరి

ప్రస్తుతం ఈ మార్గంలో రెండు వరుసల రహదారి మాత్రమే ఉంది. దీనిని నాలుగు వరుసలుగా మార్చేందుకు సర్వే పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయితే, ఆకాశగంగ ప్రాంతం అటవీ ప్రాంతంగా ఉన్నందున అటవీ శాఖ అనుమతులు అవసరమవుతాయి. ఈ మేరకు టీటీడీ అధికారులు అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నారు.

తిరుమలలో వాహనాల రద్దీ తగ్గుతుంది

ఈ ప్రాజెక్టు పూర్తయిన తరువాత తిరుమలలో వాహనాల రద్దీ తగ్గి భక్తులకు ప్రయాణం మరింత సౌకర్యంగా మారనుంది. ప్రత్యేకించి పండుగలు, వీకెండ్ల సమయంలో కలిగే ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు ఈ రహదారి నిర్మాణం ఎంతో ఉపయోగకరంగా మారుతుందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు.

4 line highway Ap Google news tirumala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.