📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Minister Savita: అన్నపర్రు ఘటన పునరావృతం కాకుండా చర్యలు

Author Icon By Saritha
Updated: October 13, 2025 • 12:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అన్నపర్రు ఘటన పునరావృతం కాకుండా చర్యలు

విజయవాడ : అన్నపర్రు బీసీ హాస్టల్ లాంటి ఘటన రాష్ట్రంలో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సవిత (minister savita) ఆదేశించారు. ప్రస్తుతం కురు స్తున్న వర్షాల నేపథ్యంలో నిరంతరం అప్రమ త్తంగా ఉండేలా వార్డెన్లను ఆదేశించాలన్నారు. డీబీసీడబ్ల్యూవోలు తమ పరిధిలో హాస్టళ్లను నిరంతం పర్యవేక్షించాలన్నారు. హాస్టళ్లలో వార్డెన్లు ఉండేలా చూడాలని, బయట ఆహారం హాస్టళ్లోకి రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులను సొంత బిడ్డల్లా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని టెలీ కాన్ఫరెన్స్ లో మంత్రి సవిత స్పష్టం చేశారు. జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న అన్నపర్రు బీసీ హాస్టల్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వారి ఆరోగ్యం (health) పూర్తిగా మెరుగయ్యేకే డిశ్చార్జి చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత ఆదేశించారు. అన్నపర్రు బీసీ హాస్టల్ విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులపై బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్. సత్యనారాయణ, డైరెక్టర్ మల్లికార్జున, జీజీహెచ్ సూపరింటెం డెంట్ ఎస్.వి.వి.రమణతో మంత్రి సవిత తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న విద్యార్థు ఆరోగ్య పరిస్థితి గురించి జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎస్.వి.వి. రమణను చికిత్స పొందుతున్నారని, ఒక విద్యార్థి అడిగి తెలుసుకున్నారు. 60 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలతో ఆసుపత్రికి చేరగా, ప్రస్తుతం 24 మంది మాత్రమే ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స అందజేస్తున్నామని జీజీహెచ్. సూపరింటెండెంట్ ఎస్.వి.వి.రమణ తెలిపారు

Read also: ఎట్టకేలకు ఏడుగురు బందీలను విడుదల చేసిన హమాస్

విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

ఆ విద్యార్థి ఇంతకుముందు నుంచే కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధడుతుండడంతో ఐసీయూలో వైద్యమందిస్తున్నామన్నారు. మరో ఇద్దరు విద్యార్థులు పెదనందిపాడు కల్యాణ మండపంలో ఏర్పాటుచేసిన తాత్కాలిక వైద్య శిబిరంలో చికిత్స పొందుతున్నారన్నారు. మిగిలిన విద్యార్థులను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశామన్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత (minister savita) స్పందిస్తూ, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఆ విద్యార్థుల ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిన తరవాతే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేయాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యంపై గంటకు గంటకూ అప్ డేట్ ఇవ్వాలని స్పష్టంచేశారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న విద్యార్థిని తక్షణమే ఎయిమ్స్ కు తరలించాలని మంత్రి సవిత ఆదేశించారు డిశ్చార్జి అయిన విద్యార్థు లతో పాటు హాస్టల్ లో ఉన్న మిగిలిన విద్యార్థులను వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి సత్యనారాయణను, డైరెక్టర్ మల్లికార్జునను మంత్రి సవిత ఆదేశించారు. హాస్టల్ లో పరిశుభ్రతతపై తీసుకున్న చర్యలు గురించి డీబీసీడబ్ల్యూవో మయూరిని అడిగి తెలుసుకున్నారు. వేడి చల్లార్చిన నీటితో పాటు తాజా ఆహారమే వారికి అందివ్వాలన్నారు. హాస్టల్ పరిసరాలను పరి శుభ్రంగా ఉంచాలని, దోమలు వృద్ధి చెందకుండా బ్లీచింగ్ చల్లాని స్పష్టం చేశారు. హాస్టల్ పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇళ్లకు వెళ్లదలుచుకున్న విద్యా ర్థులను వారి తల్లిదండ్రులను పిలిచి వారితో పంపించాలన్నారు.

https://vaartha.com/telangana/indiramma-illu-good-news-scheme-delay-vikarabad-district/563644/

Andhra Pradesh News Annaparru incident BC Welfare Department cleanliness drive food poisoning hostel safety Minister Savita Student Health Vijayawada

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.