📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

Vaartha live news : YS Sharmila: అన్నమయ్య ప్రాజెక్టు ఇక అంతేనయ్య : షర్మిల

Author Icon By Divya Vani M
Updated: September 1, 2025 • 8:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అన్నమయ్య ప్రాజెక్ట్ (Annamayya Project) పునర్నిర్మాణంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) తీవ్ర స్థాయిలో స్పందించారు. గత వైసీపీ ప్రభుత్వం, ప్రస్తుత కూటమి ప్రభుత్వం రెండూ పూర్తిగా విఫలమయ్యాయని ఆమె ధ్వజమెత్తారు. ప్రాజెక్ట్ కొట్టుకుపోయి ఐదేళ్లు గడిచినా, 39 మంది బలి అయిన ఆ దారుణ ఘటన బాధితుల జీవితం ఇంకా దుఃఖంలోనే కూరుకుపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.”ప్రాజెక్ట్ దెబ్బతిని ఐదేళ్లు దాటిపోయాయి. కానీ పునర్నిర్మాణం ఇప్పటికీ మొదలు కాలేదు. 39 మందిని బలిగొన్న ఆ ఘోర విపత్తులో జరిగిన నష్టం పూడ్చే చిత్తశుద్ధి రెండు ప్రభుత్వాలకూ లేదు” అని షర్మిల మండిపడ్డారు.

బాధితులకు ఉపశమనం ఎక్కడ?

ఐదు గ్రామాలు కొట్టుకుపోయినా పునరావాసానికి ఒక్క రూపాయి ఇవ్వలేదు. సర్వం కోల్పోయిన నిరాశ్రయులు నేటికీ ఎవరూ ఆదుకోవడం లేదు. గత సీఎం జగన్ రూ.800 కోట్లతో మరమ్మతులు చేస్తామని చెప్పి మూడు సంవత్సరాలు గడిపారు. కానీ వాస్తవానికి తట్టెడు మట్టీ కదల్లేదు. బాధిత కుటుంబాలకు ఇళ్లు ఇవ్వలేదు. మరణించిన కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వలేదు అని ఆమె విమర్శించారు.”ఇసుక మాఫియాతో ప్రాజెక్ట్ బలహీనపడినా, అసెంబ్లీలో హై లెవెల్ కమిటీలు ఏర్పాటు చేస్తామంటూ కాలయాపన చేశారు. దర్యాప్తు పేరుతో సమయం వృథా చేశారు. కానీ ప్రాజెక్ట్ పునరుద్ధరణలో ఎలాంటి చర్యలు చేపట్టలేదు. చివరికి జగన్ గారి పనితీరు సున్నాగా మారింది” అని షర్మిల తేల్చిచెప్పారు.

చంద్రబాబు ప్రభుత్వానికీ గట్టి దెబ్బ

అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రాజెక్ట్ కడతామని చంద్రబాబు చెప్పారు. కానీ అది కూడా మోసమే అయింది. రాజంపేటకు రెండు సార్లు వచ్చినా పనులు మొదలు కాలేదు. రూ.340 కోట్ల మరమ్మతుల మాటలు చెప్పి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. డ్యామ్ నిర్మాణం కోసం సర్వే పేరుతో కాలయాపన చేస్తున్నారు. రాజంపేట వేదికగా మరోసారి మాయ మాటలు చెప్పారు కానీ దిశా నిర్దేశం మాత్రం లేదు అని షర్మిల ధ్వజమెత్తారు.కాంగ్రెస్ పార్టీ పక్షాన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అన్నమయ్య కన్నీటి వ్యధకు శాశ్వత పరిష్కారం చూపాలి. గత ఐదేళ్లుగా నీటి నిల్వ లేక 30 వేల ఎకరాలకు సాగునీరు అందడం లేదు. లక్ష మందికి త్రాగునీరు అందడం లేదు. వెంటనే పూర్తి స్థాయి నిధులు కేటాయించి ప్రాజెక్ట్ పూర్తి చేయాలి. అలాగే ప్రాణాలు, ఆస్తులు కోల్పోయిన కుటుంబాలకు హామీల మేరకు పూర్తి స్థాయి న్యాయం జరగాలి” అని షర్మిల స్పష్టం చేశారు.

Read Also :

https://vaartha.com/mahesh-babu-is-not-in-mirai-reveals-teja-sajja/cinema/539621/

annamayya project AP Coalition Government Sharmila's criticism YCP's failure

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.