📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Annamayya project: అన్నమయ్య ప్రాజెక్టును పరిశీలించిన నిపుణుల బృందం

Author Icon By Anusha
Updated: July 14, 2025 • 11:11 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రభుత్వ అనుమతితో త్వరలో పునర్నిర్మాణం

రాజంపేట : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి కడప జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్టును నిపుణుల బృందం ఆదివారం పరిశీలించింది. గత రెండు రోజులుగా అన్నమయ్య ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర వివరాలను నిపుణుల కమిటీ (Committee of Experts) పరిశీలించింది. ఒక్క రోజంతా ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్లు, సాంకేతిక వివరాలు, భూ గర్భంలో నేల స్వభావం, ప్రాజెక్టు గేట్ డిజైన్లు ఇప్పటివరకు అన్నమయ్య ప్రాజెక్టుకు వచ్చిన వరద నీటి పరిస్థితి ఈ సంధర్భంగా చోటు చేసుకున్న పరిణామాలను ప్రాజెక్టు అధికారులను తీసుకోవడమే కాకుండా దానికి సంబంధించిన పత్రాలను, వివరాలను పరిశీలించింది. ప్రభుత్వం నియమించిన డిజైన్ ఎక్స్ పర్ట్, పోలవరం చీఫ్ ఇంజనీర్ రమేష్కుమార్, హైడ్రో మెకానికల్ ఎక్స్పర్ట్ కె. సత్యనారాయణ జీయాలజిస్ట్ ఎం.రాజు, సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్(సీడీఓ) చీఫ్ ఇంజనీర్ విజయభాస్కర్, కడప జిల్లా జల వనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ శ్రీరామ చంద్రమూర్తి అన్నమయ్య ప్రాజెక్టును పరిశీలించడం జరిగింది.

వివిధ అంశాలను

ఎర్త్ డ్యాం కొట్టుకుపోయిన ప్రాంతాన్ని, వారు పరిశీలించారు. అనంతరం స్పిల్వేని పరిశీలించారు. స్పిల్ వే ప్రక్కన ప్రారంభమైన మట్టికట్ట ప్రాంతాన్ని పరిశీలించారు. అలాగే ప్రాజెక్టు కుడివైపున కొండ. ప్రాంతాన్ని పరిశీలించారు. ఎర్త్ డ్యాం కొట్టుకు పోయిన నదీ మధ్యలో ప్రాంతాన్ని పరిశీలించారు. అంతే కాకుండా రాక్ ఫిల్ డ్యాం (Rock fill dam) నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియను చేపడితే ఎలా ఉంటుందో పరిశీలించారు. అనంతరం చీఫ్ ఇంజనీర్ శ్రీరామ చంద్రమూర్తి మీడియాతో మాట్లాడుతూ నిపుణుల కమిటీ ప్రాజెక్టును క్షుణ్నంగా పరిశీలించిందన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తీసుకుందన్నారు. జియోలాజికల్ హైడ్రాలిక్ రాక్సాయల్ తో పాటు వివిధ అంశాలను చర్చించడం జరిగిందన్నారు. నిపుణుల కమిటీ నివేదిక సిద్ధం చేసిన తర్వాత ప్రభుత్వానికి పంపుతుందన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే ప్రాజెక్టు పునర్నిర్మాణ పనులను ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు.

Annamayya project

పునర్నిర్మాణ పనులు

అంతకుముందు నిపుణుల బృందాన్ని అన్నమయ్య జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు కలిశారు. ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ వెంటనే ప్రాజెక్టును పరిశీలించడం సంతోషంగా ఉందన్నారు. సీఎం ఆదేశాల మేరకు అన్నమయ్య ప్రాజెక్టు (Annamayya project) పునర్నిర్మాణ పనులు ప్రారం భించేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు జరు గుతున్నాయని అన్నారు. అందులో భాగంగానే నిపణుల బృందం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ ఎస్ఈ అబ్దు సమీ, ఈఈలు జయచంద్రా రెడ్డి, రవికిరణ్, ఏఈలు గురుమోహన్ తదితరులు పాల్గొన్నారు.

కడప ప్రత్యేకత ఏమిటి?

కడప పట్టణం దాని ప్రత్యేకమైన రుచులకుగానూ, మసాలా వంటకాలకుగానూ ప్రసిద్ధి చెందింది. దక్షిణ భారతీయ వంటక శైలికి సమీపంగా ఉన్నప్పటికీ, కడప ఫుడ్‌కి స్వతంత్రమైన స్పైసీ ఫ్లేవర్ ఉంటుంది. కారం దోస కడప ప్రజలకి చాలా ఇష్టమైన టిఫిన్.

కడప పాత పేరు ఏమిటి?

కడపకు పూర్వం “కుడప్పా” (Cuddapah) అనే పేరు ఉండేది. ఇది తెలుగు పదమైన “గడప” నుండి ఆంగ్లీకరించబడిన రూపం. “గడప” అంటే “ప్రవేశ ద్వారం” అని అర్థం. తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే యాత్రికుల మార్గంలో కడప ఒక ప్రవేశ ద్వారంగా ఉండటంతో, ఈ ప్రాంతానికి ఆ పేరు పెట్టారు. తర్వాత ఆంగ్ల పాలన సమయంలో దాన్ని “Cuddapah”గా మార్చారు. ప్రస్తుతం దీన్ని తిరిగి “కడప”గా అధికారికంగా మార్చారు.

Read hindi news: https://hindi.vaartha.com/

Read Also: Bobbili: బొబ్బిలి వీణకు అరుదైన గుర్తింపు

Andhra Pradesh expert committee Annamayya dam review Annamayya project inspection AP water resources Breaking News flood safety Kadapa irrigation project Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.