vijayawada: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కావాలనే రెచ్చగొడుతున్నారని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత (Anita) ధ్వజమెత్తారు. జగన్ వాహనం కింద ఓ వ్యక్తి పడిన ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. దయ, జాలి లేకుండా అతడ్ని ముళ్ల పొదల్లో పడేశారని హోంమంత్రి అనిత ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం సమాచార సమావేశ ప్రాంగణంలో హోంమంత్రి అనిత (Anita) మీడియాతో మాట్లాడారు. జగన్ కు సత్తెనపల్లి పర్యటన సందర్భంగా జడ్స్ సెక్యూరిటీ కల్పించమని స్పష్టం చేశారు. పరామర్శకు వెళ్తూ జగన్ రోడ్ చేశారని ధ్వజమెత్తారు. ఉదయం పదిన్నరకు తాడేపల్లి నుంచి బయల్దేరిన జగన్.. సాయంత్రం 4 గంటలకు రెంటపాళ్ల చేరుకున్నారని తెలిపారు. జగన్ కావాలనే బలప్రదర్శన చేసుకుంటూ వెళ్లారని చెప్పుకొచ్చారు.. సింగయ్యను సమయానికి ఆస్పత్రికి తరలిస్తే బతికేవారని హోంమంత్రి అనిత అన్నారు. దళితుడు జగన్ కారు టైర్ కింద నలిగిపోయినా పట్టించుకోలేదని మండిపడ్డారు.
రాజకీయ ముసుగులో నేరస్తుడిగా జగన్
జగన్ కు రాజకీయ లబ్ధి తప్పించి మనుషుల ప్రాణాలంటే లెక్క లేదా అని ప్రశ్నించారు. జగన్ (Jagan) పర్యటనలో ఇద్దరు చనిపోయినా పర్యటన కొనసాగించారని ఫైర్ అయ్యారు. బెట్టింగ్లో అప్పులపాలై చనిపోయిన వ్యక్తికి విగ్రహం పెట్టించారని చెప్పుకొచ్చారు. తన పర్యటనలో ఇద్దరు చనిపోయినా జగన్ రెడ్డి ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. జగన్ కు ఇంకా సీఎం కుర్చీలో కూర్చోవాలనే దురాశ ఉందని చెప్పారు. జగన్ వాహనం కిందపడి సింగయ్య నలిగిపోయినట్లు వీడియో ఉందని అన్నారు. సింగయ్య మృతిని వైసీపీ నేతలు నిస్సిగ్గుగా సమర్థిస్తున్నారని.. చనిపోయింది తమ పార్టీ కార్యకర్తేగా అని కొంతమంది నేతలు అంటున్నారని తెలిపారు. జగన్ (Jagan) రాజకీయ ముసుగులో ఉన్న నేరస్థుడని ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో జగన్ ఎందుకు వెళ్లట్లేదని ప్రశ్నించారు. జగన్ కావాలనే విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు హోంమంత్రి అనిత.
“నాయకులు బాధ్యతగా ఉండాలి” – అనిత ఆగ్రహం
నాయకులు అనే వారు ఎంతో బాధ్యతగా ఉండాలి. పరిస్థితులు జగన్ వచ్చాక ఇంతగా దిగజారిపోయాయా అనిపిస్తోంది. హింసను చేస్తూ దాన్ని జగన్ సమర్థించుకుంటున్నారు. పొదిలిలో వైసీపీ అరాచకం చూశాం.. ఆ వెంటనే రెంటవల్లె వెళ్తాం అన్నారు. వెంటనే మేము నోటీస్ ఇచ్చాం. ఇంతమందితోనే వెళ్లాలని చెప్పాం. పరామర్శకు వెళ్లే వ్యక్తి రోడ్ షో చేశారు. జగన్ నిర్లక్ష్యం కారణంగా సింగయ్య, రెడ్డి అనే వాళ్లు చనిపోయారు. అప్పటికీ కూడా. ఇంకా సమర్ధించుకోవడం దారుణం. ఆ వీడియో మార్ఫింగ్ అని కూడా ఫ్యాన్ పార్టీ నేతలు అంటున్నారు. ఇంత దారుణమా. మంత్రి నారా లోకేష్ పరామర్శకు వెళ్తే ఫొటో కూడా ఇవ్వరు.. అది ఆయన రాజకీయ పరిస్థితి. మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నజగన్ కి బాధ్యత లేదా. వైసీపీ కార్యకర్త పేరుతో ఒక చేత్తో గొడ్డలి.. మరో చేత్తో వైసీపీ జెండా పట్టుకుంటారు. కార్యకర్త ప్రదర్శించిన ప్లకార్డులు సినిమా డైలాగ్లు తప్పేముందని జగన్ సమర్దిస్తారా. సినిమాలో చెప్పిన డైలాగ్లు బయట నిజం చేస్తాం అంటే ఎలా. పరామర్శకు వెళ్లే వ్యక్తికి 7గంటల పాటు రోడ్ షో అవసరమా? పరామర్శను బలప్రదర్శనగా మార్చుకుంటారా? జగన్, అతని మనుషులు రాజకీయాలను దిగజారుస్తున్నారని అన్నారు.
Read also: AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ సమావేశం .. పలు కీలక అంశాలపై చర్చ