📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Anil Kumar Yadav: అనిల్ మెడకు బిగుస్తున్న ఉచ్చు.. ఏ క్షణమైనా అరెస్టు!

Author Icon By Anusha
Updated: July 23, 2025 • 2:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక వైసీపీ నేతలను టార్గెట్ చేస్తున్నది. కూటమి ప్రభుత్వం పూర్తిగా రివెంజ్ పాలన సాగిస్తున్నట్లుగా,వరుసగా జరుగుతున్న పరిణామాలను బట్టి గ్రహించవచ్చు. మాజీసిఎం జగన్మోహన్రెడ్డి పాలనలో పలు అక్రమాలు, కుంభకోణాలు,జరిగాయని వరుస కేసులను నమోదు చేస్తున్నారు. అక్రమ మైనింగ్ కేసు (Illegal mining case) లో అరెస్టు అయిన మాజీమంత్రి కాకాని గోవర్ధన్రెడ్డి రెండునెలలుగా,జైలులోనే ఉన్నారు. ఆయనపై పదికి పైగా కేసులు నమోదవడంతో వైసీపీ నేతలను కేసులు వెంటాడుతున్నాయి. అక్రమ తవ్వకాల కేసులో అరెస్ట్,అయిన శ్రీకాంత్రెడ్డి ఇచ్చిన సమాచారంతో ఇప్పుడు మాజీ మంత్రి అనిల్కు ఉచ్చుబిగిస్తుంది. క్వార్ట్జ్ కేసులో అనిల్కుమార్ అనుచరుడు,శ్రీకాంత్రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని నుంచి మరింత సమాచారం రాబట్టారు. అతని వాంగ్మూలంలో సంచలన విషయాలు,వెలుగులోకి వచ్చాయి. అనిల్కుమార్ యాదవ్, కాకాణి గోవర్ధన్రెడ్డితో తనకు వవ్యాపార లావాదేవీలు ఉన్నాయని శ్రీకాంత్రెడ్డి అంగీకరించినట్లు,పోలీసులు తెలిపారు.

లీజు గడువు ముగిసినా క్వార్ట్జ్ తీశారు

2023 ఆగస్టు నుంచి క్వార్జ్ వ్యాపారం సాగింది. లీజు గడువు ముగిసినా రుస్తుం మైన్ నుంచి క్వార్జ్ తీశారు. వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసరెడ్డి క్వారీ పనులు చూసుకున్నారు. పర్యవేక్షించినందుకు తనకు టన్నుకు వెయ్యి రూపాయలు ఇచ్చేవాళ్లని శ్రీకాంత్రెడ్డి (Sreekanth Reddy) వాంగ్మూలం,ఇచ్చారు. క్వార్ట్న డంప్ చేసిన పొలం యజమాని శశిధర్రెడ్డిని ఎకరాకు 25వేల చొప్పున ఇచ్చేలా ఒప్పందం జరిగిందన్నారు. ఇందులోఅనిలియాదవ్ భాగస్వామిగా ఉన్నారని శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు.

Anil Kumar Yadav: అనిల్ మెడకు బిగుస్తున్న ఉచ్చు.. ఏ క్షణమైనా అరెస్టు!

ఏ క్షణమైనా అనిల్షాదవ్ అరెస్టు?

శ్రీకాంత్రెడ్డి ఇచ్చిన ఈ వాంగ్మూలంతో మాజీమంత్రి అనిల్ పాత్ర స్పష్టంగా ఉందని అధికారులు గుర్తించారు. అనిల్ను ఎప్పుడైనా అరెస్ట్,చేయొచ్చనే ప్రచారం జరుగుతుంది. అయితే మేజిస్ట్రేట్ ఎదుట శ్రీకాంత్రెడ్డి (Srikanthreddy) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. పోలీసులు,తనతో బలవంతంగా సంతకాలు చేయించారని ఆయన ఆరోపించారు. రిమాండ్ రిపోర్ట్లో ఏముందో తనకు తెలియదని కూడా శ్రీకాంత్రెడ్డి వెల్లడించారు.

వల్లభనేని వంశీపై పలు కేసులు

వైసీపీ నేత వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదు చేసి, జైల్లో పెట్టిన విషయం తెలిసిందే. పోసాని మురళీకృష్ణను కూడా డిప్యూటీ సీఎం,పవన్కళ్యాన్ పై అనుచిత వ్యాఖ్యలతో ఆయనపై కేసులు నమోదు చేశారు. దీనితో ఆయన రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎవరు స్థాపించారు?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని (YSRCP) వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి 2011లో స్థాపించారు. అప్పటి వరకు ఆయన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పేరు ఎలా వచ్చిందీ?

ఈ పార్టీ పేరు ఆయన తండ్రి డా. వై.ఎస్. రాజశేఖరరెడ్డి గారి పేరు మీద పెట్టబడింది. ఆయనను ఆదర్శంగా తీసుకుని ప్రజల కోసం సేవ చేయాలనే ఉద్దేశంతో పార్టీకి వైఎస్సార్ అనే పేరు పెట్టారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Tirumala: భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా వైకుంఠమ్ 3 కాంప్లెక్స్ నిర్మాణం

anil kumar yadav Breaking News Coalition Government illegal mining case Jagan Mohan Reddy Kakani Govardhan Reddy latest news quartz case revenge politics srikanth reddy Telugu News YCP leaders

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.