పశ్చిమగోదావరి : పల్లెల్లో సంక్రాంతి సందడి మొదలు కానున్న నేపథ్యంలో పశ్చిమగో కోడి పందేల నిమిత్తం భారీ బరులు సిద్ధం చేసారు. భీమవరం సమీపం లోని ఓ గ్రామంలో క్రికెట్ స్టేడియం ను తలపించే భారీ బరి ఇప్పటికే సిద్ధమైంది. ఒక ప్రక్క అధికారులు,(AndhraPradesh) ఒకపక్క పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ నిర్వాహకులు బేఖాతరు చేస్తున్నారు. ఈ సందర్భంగా సందట్లో సడేమియా అంటూ బడాబాబులు కొందరు సంప్రదాయం మున ఎగులో డబ్బులు దండుకునే ప్రయత్నానికి తెరలేపారు. కోడి పందేల బరులు ఉన్నచోట చట్ట విరుద్ధమైన జూడాలు గుండాట, మూడు ముక్కలాటలు కూడా నిర్వహిస్తారు.
Read also: TTD: ఆకలికి చోటే లేని పవిత్ర స్థలం తిరుమల
ఈ ఏడాది కూడా సంప్రదాయంగా ఆడే కోడిపందేలను జూదంగా మార్చి రూ.లక్షలు వెనకేసుకునేందుకు కొందరు మండలాల్లో ఇప్పటికే పెద్ద మైదాన ప్రాంతాలను చదును చేసి ఇనుప సిద్ధమవుతున్నారు. జిల్లాలోని భీమవరం,(AndhraPradesh) ఉండి, ఆకివీడు, కైకలూరు కంచెతో బరులు ఏర్పాటు చేస్తున్నారు. ఆదిలోనే వీటిపై నిఘా పెట్టాల్సిన పోలీసులు చోద్యం చూస్తుండడంపై విమర్శలు తలెత్తున్నాయి. భారీ వసూళ్లు బరులు పేరుతో పలువురు నాయకులు భారీ వసూళ్లకు పాల్పడుతున్నారు. పోలీసులు, ఇతర ఖర్చుల పేరుతో రూ.1.5లక్షల నుంచి రూ.3లక్షల వరకు ముట్టజెప్పుతున్నట్లు నిర్వాహకులు తెలుపుతున్నారు.
జూదాలు వల్ల కలిగే నష్టాలు వందేలు నిర్వహించవద్దంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ హెచ్చరిస్తున్నామని పోలీసులు హడావుడి చేస్తున్నారు. అయితే అదే గ్రామంలో బరులు ఏర్పాటు జరుగుతున్నా కనీసం అటువైపు కన్నెత్తి చూడడం లేదు. పైగా నిర్వాహకులు, జూదాలు ఆడేవారికి అవగాహన కల్పించకపోగా కేవలం ఖాళీగా బజారుల్లో కూర్చున్న వారిని తీసుకువచ్చి ఫొటో దిగి పంపించేస్తున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: