Andhrapradesh: గీత కార్మికులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

Read Time:  1 min
Andhrapradesh
Andhrapradesh
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్‌లోని గీత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి శుభవార్త తెలిపింది. మద్యం దుకాణాలు, బార్‌ల కేటాయింపులో రిజర్వేషన్ కల్పించిన తరువాత, తాజాగా “ఆదరణ – 3.0” (Adarana 3.0)పథకం ద్వారా ద్విచక్ర వాహనాలు అందించనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని బీసీ, చేనేత, జౌళి సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత వెల్లడించారు.

Andhrapradesh
Andhrapradesh

గౌతు లచ్చన్న జయంతి వేడుకల్లో కీలక నిర్ణయాల

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన బీసీ నేత సర్దార్ గౌతు లచ్చన్న 116వ జయంతి వేడుకలో ఈ ప్రకటన జరిగింది. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఆదరణ 3.0 పథకం – గీత కార్మికులకు సాయం

మంత్రి సవిత మాట్లాడుతూ..

  • “ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గౌతు లచ్చన్న స్ఫూర్తితో పాలన కొనసాగిస్తున్నారు.
  • త్వరలో ఆదరణ 3.0 పథకం ప్రారంభించి, గీత కార్మికులకు ద్విచక్ర వాహనాలు (Two-wheelers for Geeta workers)అందిస్తాం.
  • తాటి చెట్లపైకి ఎక్కే కార్మికులకు ఆధునిక పరికరాలు అందించడంతో పాటు, తాటి ఉత్పత్తుల ఆధారంగా ఉపాధి కల్పన కోసం రంపచోడవరం ఉద్యాన పరిశోధన కేంద్రంలో చర్యలు చేపడతాం” అని తెలిపారు.

గౌతు లచ్చన్న జీవితం స్ఫూర్తిదాయకం

మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. “పల్లెటూరిలో పేద కుటుంబంలో జన్మించినా, గౌతు లచ్చన్న గారు 95 ఏళ్ల వయసు వరకు రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఆయన జీవితం ప్రేరణాత్మకం. నేటి నాయకులు ఆయన ఆచరణ నుంచి ప్రేరణ పొందాలి” అని పేర్కొన్నారు.

బీసీల గౌరవానికి తెదేపా ప్రభుత్వం ముందంజ

ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ.. “బీసీ వర్గాలకు గౌరవం ఇచ్చే విషయంలో తెదేపా ప్రభుత్వమే ఎల్లప్పుడూ ముందుంటుంది” అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్ బొండా ఉమా, ఎంపీ కేశినేని శివనాథ్, మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ, కేఈ ప్రభాకర్, ఎమ్మెల్యేలు కాగిత కృష్ణప్రసాద్, గౌతు శిరీష, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/indian-railways-secunderabad-tirupati-special-trains/telangana/531414/

Sharanya

రచయిత గురించి

Sharanya

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.