Andhra Pradesh weather : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఒక్కసారిగా చలి తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోవడంతో ప్రజలు వణుకుతున్నారు. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ తెలంగాణ ప్రాంతాల్లో చలి తీవ్రంగా ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ చలి పరిస్థితులు ఇంకా రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
హైదరాబాద్‌లోనూ ఉష్ణోగ్రతలు అనూహ్యంగా తగ్గాయి. పటాన్‌చెరులో కనిష్టంగా 9 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, రాజేంద్రనగర్‌లో 10 డిగ్రీలు, బేగంపేట విమానాశ్రయంలో 12.4 డిగ్రీలుగా నమోదయ్యాయి. నగరానికి ఆనుకుని ఉన్న శివారు ప్రాంతాల్లో చలి మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
Read also:Akilesh Yadav: యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌లో బిజీ టూర్
తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రత ఆదిలాబాద్ జిల్లాలో 6.2 డిగ్రీలుగా నమోదైంది. మెదక్‌లో 8.8 డిగ్రీలు, రామగుండంలో 11.8, హనుమకొండలో 12, నిజామాబాద్‌లో 12.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. ఉదయం, రాత్రి వేళల్లో (Andhra Pradesh weather) చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు బయటకు రావడానికి వెనుకంజ వేస్తున్నారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ చలి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అరకు లోయలో కనిష్టంగా 4.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఏజెన్సీ ప్రాంతాల్లో అనేక చోట్ల సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దట్టమైన పొగమంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ చలి పరిస్థితుల నేపథ్యంలో వృద్ధులు, పిల్లలు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. ఉదయం, రాత్రి వేళల్లో బయటకు వెళ్లేటప్పుడు తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: