వేమన సమాధి ప్రాంతాన్ని టూరిజం సర్క్యూట్ లో చేర్చాలి: పర్యాటకులు
అనంతపురం : ప్రముఖ సంఘ సంస్కర్త, విశ్వ కవి యోగివేమన జయంతి వేడుకలను ఈ నెల 19వ తేదీన ప్రభుత్వపరంగా నిర్వహిస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్ల పెంట మండలం కటారిపల్లెలో వేమన సమాధి ఉంది. కటారి పల్లెలో ఉన్న వేమన (vemana) జీవ సమాధిని సందర్శించేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు, అభిమానులు వస్తుంటారు.
Read also: Vizag: రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీ కొట్టిన బైక్.. స్పాట్ డెడ్
Yogi Vemana’s birth anniversary celebrations are today
కటారిపల్లెలో యోగివేమన జీవ సమాధి – ఆధ్యాత్మిక ఆకర్షణ
ఇటీవల శ్రీ సత్య సాయి బాబా శతజయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పరంగా అట్టహాసంగా నిర్వహించిన నేపథ్యంలో విశ్వ కవి యోగివేమన జయంతి వేడుకలను కూడా ప్రభుత్వపరంగా నిర్వహిస్తున్న విశేషం. కదిరి ప్రాంతంలో ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రం తిమ్మమ్మ మర్రిమాను, ప్రముఖ పుణ్యక్షేత్రం కదిరి లక్ష్మీ నరసింహస్వామి, విశ్వకవి, సంఘసంస్కర్త అయిన యోగివేమన సమాధి ఉన్న ప్రాంతాలను ఒక టూరిజం సర్క్యూట్ లోకి చేర్చడంతో పాటు యోగివేమన జీవ సమాధి ఉన్న కటారి పల్లె ను అన్ని విధాల రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పలువురు పర్యాటకులు కోరుకుంటున్నారు.
టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చేయాలన్న పర్యాటకుల డిమాండ్
గతంలో టూరిజం శాఖ తరపున పెద్ద భవనాలు, రూములు నిర్మించినప్పటికీ సరైన నిర్వహణ లేకపోవడం, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండడం. తదితర కారణాలవల్ల అభివృద్ధికి నోచుకోలేదు. ఇటీవల కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రత్యేక చొరవ. తీసుకొని విశ్వ కవి యోగివేమన జయంతి నీ ప్రభుత్వపరంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ను ప్రత్యేకంగా కలిసి విజప్తి చేయడంతో సీఎం స్పందించి ప్రభుత్వవరంగా వేడుకలు నిర్వహించేందుకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: