हिन्दी | Epaper
ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

Andhra Pradesh: ఈ నెల 21న విశాఖలో ‘యోగాంధ్ర’ కార్యక్రమం

Sharanya
Andhra Pradesh: ఈ నెల 21న విశాఖలో ‘యోగాంధ్ర’ కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోని విశాఖపట్నం నగరం ఈ నెల 21వ తేదీన చారిత్రాత్మక ‘యోగాంధ్ర’ (Yoga Andhra) కార్యక్రమానికి వేదిక కానుంది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఏపీలోని కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. రికార్డు స్థాయిలో 5 లక్షల మందికి పైగా ప్రజలు పాల్గొననున్న ఈ వేడుకకు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) మరియు రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) సోషల్ మీడియా వేదికగా ప్రజలకు ప్రత్యేక పిలుపునిచ్చారు.

చంద్రబాబు వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి:

ప్రపంచానికి భారత దేశం ప్రసాదించిన దివ్య వరం యోగ. ఆరోగ్యాన్నే కాకుండా ఆయుష్షును పెంచే యోగ మన జీవన విధానం కావాలి. ఈ నెల 21న విశాఖపట్నంలో 11వ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ‘యోగాంధ్ర’ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు ముఖ్య అతిధిగా పాల్గొంటున్నారు. రండి మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. యోగాను జీవితంలో భాగం చేసుకుందాం ఆరోగ్యంగా జీవిద్దాం” అని చంద్రబాబు పేర్కొన్నారు.

లోకేశ్ సందేశం:

“యోగా వ్యాయామం మాత్రమే కాదు, అది ఒక జీవన మార్గం. మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతో అవసరం. ప్రపంచానికి భారత్ అందిస్తున్న గొప్ప వరం యోగా. ఆరోగ్యకరమైన జీవనశైలికి యోగా ఎంతగానో తోడ్పడుతుంది. ఈ నెల 21వ తేదీన విశాఖపట్నంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ యోగా దినోత్సవంలో మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు పాల్గొంటున్నారు. రికార్డు స్థాయిలో నిర్వహించే ఈ వేడుకను విజయవంతం చేయడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరుతున్నాను. యోగా వ్యాయామం మాత్రమే కాదు మన జీవన విధానం అని చాటిచెప్పండి” అని నారా లోకేశ్ వివరించారు.

Read also: Polavaram Project: పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన కేంద్ర బృందం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870