Andhra Pradesh Rain Alert: ఏపీలో రెండ్రోజులు వర్షాలు

Read Time:  1 min
Andhra Pradesh Rain Alert: ఏపీలో రెండ్రోజులు వర్షాలు
FONT SIZE
GET APP

Andhra Pradesh Rain Alert: నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం సోమవారం నాటికి అల్పపీడనంగా బలహీనపడిందని భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది. ఇది ప్రస్తుతం ఈశాన్య దిశగా కదులుతోందని, మంగళవారం నాటికి మరింత బలహీనపడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Read Also: Telangana Rains: అల్పపీడన ప్రభావంతో సంగారెడ్డిలో వడగండ్ల వాన

రాష్ట్రంలో వర్ష సూచన

దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో మంగళ, బుధవారాల్లో వాతావరణం మారనుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షపు జల్లులు పడవచ్చు.

Andhra Pradesh Rain Alert: పిడుగుల ముప్పు – ప్రజలకు సూచనలు

వర్షాలతో పాటు కొన్ని చోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపరులు మరియు సామాన్య ప్రజలు వర్షం పడే సమయంలో చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని, సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని అధికారులు సూచించారు.

hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Siva Prasad

రచయిత గురించి

Siva Prasad

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.