📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Andhra Pradesh Weather: ఏపీ ప్రజలకు చల్లని కబురు: నేడు పలు జిల్లాల్లో వర్షాలు

Author Icon By Aanusha
Updated: March 18, 2026 • 12:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Andhra Pradesh Weather: త కొద్ది రోజులుగా భానుడి భగభగలతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరియు ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం చల్లబడనుంది. నేడు పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.

Read Also: Gas : గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ విషయంలో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

ద్రోణి ప్రభావం ఎక్కడెక్కడ?

పశ్చిమ- మధ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తరాంధ్ర తీరానికి ఆనుకొని ఏర్పడిన ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది మరింత విస్తరించడానికి అనుకూల వాతావరణం నెలకొంది. ఉత్తరాంధ్రతో పాటు ఛత్తీస్ గఢ్, తెలంగాణ ఉత్తర ప్రాంతం మీదుగా ఇది విస్తరిస్తోంది. దీని ప్రభావంతో నేడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది.

ద్రోణి, నైరుతి దిశ నుంచి వీచే గాలుల ప్రభావంతో నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయి.

Andhra Pradesh Weather: Cold news for the people of AP: Rains in many districts today

వర్షాలు కురిసే అవకాశం

తీర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశాలు లేకపోలేదు. అలాగే రాయలసీమ రీజియన్ లోని కర్నూలు, నంద్యాల, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది.

పిడుగులు పడే అవకాశం ఉన్నందున రైతులు, వ్యవసాయ కార్మికులు చెట్ల కింద ఆశ్రయం తీసుకోకూడదని హెచ్చరించింది. బలమైన గాలుల వల్ల కొమ్మలు విరిగిపడొచ్చని, పిడుగులు పడే ప్రమాదం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

AP Weather Report Bay of Bengal trough North Andhra Rain Rains in Andhra Pradesh Rayalaseema Weather

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.