📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్

Andhra Pradesh Tourism: పర్యాటక రంగంలోఅద్భుతాల ఆవిష్కరణ

Author Icon By Rajitha
Updated: February 9, 2026 • 11:13 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా గ్రామీణ పర్యాటకానికి కొత్త ఊపిరి

సరికొత్త ప్రచార నమూనాకు శ్రీకారం: మంత్రి కందుల దుర్గేష్

ఆంధ్రప్రదేశ్ పర్యాటకాన్ని కేవలం కొన్ని ప్రసిద్ధ ప్రాంతాలకే పరిమితం చేయకుండా, రాష్ట్రంలోని ప్రతి గ్రామీణ ప్రాంతాన్ని ప్రత్యేక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ (kandula durgesh) తెలిపారు. పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, ఎండీ ఆమ్రపాలి కాటల పర్యవేక్షణలో వాలంటీర్ యాత్ర సంస్థతో కలిసి చేపట్టిన వినూత్న డిజిటల్ ప్రచారం అద్భుత ఫలితాలను సాధించిందని ఆయన వెల్లడించారు. వాణిజ్య ప్రకటనలకు మాత్రమే పరిమితం కాకుండా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా క్షేత్రస్థాయి అనుభవాలను ప్రజలకు చేరవేయడమే ఈ ప్రచార ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. ఈ విధానం ద్వారా రాష్ట్రంలోని అపురూపమైన పర్యాటక ప్రదేశాలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నాయని పేర్కొన్నారు.

Read also: AP: చంద్రబాబు, జగన్ పై వైసీపీ షర్మిల వాక్యాలు

Unveiling wonders in the tourism sector.

రెండు దశల్లో నిర్వహించిన ఈ పర్యాటక ప్రచారం గణనీయమైన విజయాన్ని సాధించింది.
మొదటి దశలో 2025 డిసెంబర్ 13 నుంచి 20 వరకు ఢిల్లీ, రాజస్థాన్, అసోం, మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చిన 11 మంది ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్లు విశాఖపట్నం, అరకు వ్యాలీ, ప్రాంతాల్లో పర్యటించారు. వీరి ద్వారా రూపొందిన సినిమాటిక్ ట్రావెల్ వీడియోలు, డ్రోన్ షాట్లు కలిగిన నాణ్యమైన కంటెంట్ సుమారు 40 లక్షల మందిని ఆకట్టుకుంది. రెండో దశలో 2026 జనవరి 13 నుంచి 17 వరకు కోనసీమలో సంక్రాంతి సంబరాలను ప్రతిబింబించేలా పర్యటన సాగింది. అయోధ్య, కోల్కతా, ముంబై, ఒడిశా నుంచి వచ్చిన ఇన్ఫ్లుయెన్సర్లు స్థానిక సంప్రదాయాలు, పండుగ వైభవాన్ని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు.

ఈ ప్రచారం వల్ల గత నెల రోజుల్లోనే 1,000కు పైగా బుకింగ్ ఎంక్వైరీలు రావడం విశేషమని అధికారులు తెలిపారు. వాటిని రాష్ట్రంలోని రిజిస్టర్డ్ టూర్ ఆపరేటర్లకు బదిలీ చేయడం ద్వారా స్థానిక హోమ్‌స్టేలు, గిరిజన గైడ్లు, కళాకారులకు ఉపాధి లభించింది. దీంతో పాటు పర్యాటక శాఖకు నాణ్యమైన కంటెంట్ బ్యాంక్ కూడా సిద్ధమైంది. ఈ విజయాన్ని కొనసాగిస్తూ భవిష్యత్తులో ఆర్ట్ విలేజ్లు, హోమ్‌స్టే నెట్‌వర్క్ విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు విశాఖ, కోనసీమ సర్క్యూట్లలో రూపొందిన వీడియోలను 9 మిలియన్లకు పైగా ప్రజలు వీక్షించినట్లు వెల్లడించారు. ఈ పర్యాటక విశేషాలను ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ అధికారిక సోషల్ మీడియా పేజీల్లో చూడవచ్చని అధికారులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh Tourism influencer marketing latest news rural tourism development social media campaign Telugu News Volunteer Yatra

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.