ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రతిష్ఠను దేశవ్యాప్తంగా చాటేలా ‘విశాఖ ఉత్సవం’ను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈనెల 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు మొత్తం 9 రోజులపాటు ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈసారి ‘సీ టు స్కై’ కాన్సెప్ట్‌తో విశాఖపట్నం, అనకాపల్లి, అరకు లోయ ప్రాంతాలను కలుపుతూ పర్యాటక ఉత్సవం జరగనుంది. విశాఖలో ఈనెల 24-31 వరకు, ఈనెల 29, 30 అనకాపల్లిలో, ఈనెల 30-ఫిబ్రవరి 1 వరకు అరకు లోయలో ఈ ఉత్సవాన్ని నిర్వహించనున్నారు.
Read Also: Chittoor: చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
అనకాపల్లి జిల్లాలో ఉత్సవాలు ముగుస్తాయి
దీనిలో 10 లక్షల మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. 3000 మందికి ప్రత్యక్ష, 1800 మంది సహాయకులకు ఉపాధి లభిస్తుందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. ఈ నెల 24న విశాఖపట్నంలో విశాఖ ఉత్సవ్‌కు శ్రీకారం చుట్టి, ఫిబ్రవరి 1న అనకాపల్లి జిల్లాలో ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు.
ఉత్తరాంధ్ర వ్యాప్తంగా 20 ప్రధాన కేంద్రాల్లో 500కుపైగా సాంస్కృతిక, పర్యాటక కార్యక్రమాలు నిర్వహించేలా సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేశామని ఆయన వివరించారు.ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు,విష్ణుకుమార్‌రాజు, కొణతాల రామకృష్ణతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: