📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ

Latest News: Andhra Pradesh: విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత

Author Icon By Saritha
Updated: December 9, 2025 • 11:05 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పోటాపోటీగా టిడిపి, బిజెపి శ్రేణుల ఆందోళన

విజయవాడ : కృష్ణా జిల్లా(Andhra Pradesh) కేంద్రం మచిలీపట్నంలో టిడిపి, బిజెపి వర్గాల మధ్య తమ నాయకులు విగ్రహాల విషయంలో వివాదం తలెత్తింది. ఎన్టీఆర్, వాజ్ పేయీ పేర్ల వివాదం తలెత్తింది. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలో ఉంది. ఇందులో టిడిపి,(TDP) బిజెపి భాగస్వాములుగా ఉన్నాయి. అయితే పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ కు వాజ్ పేయి పేరు పెట్టాలని బిజెపీ నిర్ణయించింది. దీనిపై టిడిపి నేతలు మండిపడుతున్నారు.

Read also: పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు

Tension in Bandar over installation of statues

శంకుస్థాపనను అడ్డుకున్న టిడిపి నేతలు

ఈ ప్రయత్నాలపై ఆగ్రహం(Andhra Pradesh) వ్యక్తం చేస్తూ వారు నిరసనకు దిగారు. మచిలీపట్నంలోని న్యూహౌసింగ్ బోర్డు వద్ద దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి విగ్రహ నిర్మాణానికి తాజాగా స్థానిక బిజెపి నేతలు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా వారు అక్కడే ఉన్న ఎన్టీఆర్ సర్కిల్ లో ఆ విగ్రహం తీసేసి వాజ్ పేయ్ విగ్రహం తయారు చేయించి పెట్టాలని భావించారు. ఇందుకోసం వాజ్ పేయ్ విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపనకు ప్లాన్ చేశారు. దీన్ని చివరి నిమిషంలో టిడిపి నేతలు అడ్డుకున్నారు. రాష్ట్రంలో అధికార టిడిపి, కేంద్రంలో అధికార బిజెపి మధ్య ఇలా విగ్రహాల విషయంలో వివాదం చోటు చేసుకోవడం ఇదే తొలిసారి. కూటమిలో భాగస్వాములుగా ఉన్న ఇరు పార్టీల మధ్య రాష్ట్రంలో గతంలో ఎక్కడా ఇలాంటి వివాదం చోటు చేసుకోలేదు. కేవలం పార్టీలు, నేతల మధ్య వివాదాలు కాస్తా ఇప్పుడు విగ్రహాల వరకూ రావడంతో బందరులో ఏం జరుగుతుందని ఇరు పార్టీల సీనియర్ నాయకులు తెలుసుకుంటున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

BJP Coalition Government Latest News in Telugu Machilipatnam NTR Circle Statue Dispute TDP Vajpayee Statue

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.