📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Andhra Pradesh: గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

Author Icon By Saritha
Updated: March 14, 2026 • 3:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Andhra Pradesh: వంట గ్యాస్ సరఫరాపై ప్రజలు ఆందోళన చెందవద్దని ఎపి బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్ భరోసా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం(Central Govt) అన్ని రకాల ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తూ గ్యాస్ కొరత లేకుండా చూస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎపి బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరితో ఫోన్ చేసి ప్రస్తుత పరిస్థితులు పై సంభాషించారు. కేంద్ర మంత్రి గ్యాస్ విషయంలో అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Read Also: BC Janardhan Reddy: పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

Andhra Pradesh: Strict action must be taken against agencies creating a gas shortage.

కృత్రిమ కొరతను సృష్టించడం బాధాకరం

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో అంతర్జాతీయ స్థాయిలో ఇంధన సరఫరాలపై కొంత మేర ప్రభావం పడుతున్నప్పటికీ, అదే పరిస్థితిని సాకుగా చూపిస్తూ కొన్ని గ్యాస్ ఏజెన్సీలు కృత్రిమ కొరత సృష్టించి వినియోగదారులపై అదనపు భారం మోపడం సరైంది కాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ పీవీయన్ మాధవ్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ల సరఫరాను కావాలనే ఆలస్యం చేయడం, స్టాక్ ఉన్నప్పటికీ లేదని చెప్పడం, అలాగే అదనపు చార్జీలు వసూలు చేయడం వంటి ఫిర్యాదులు ప్రజల నుంచి వస్తున్నాయని ఆయన తెలిపారు.

ఇటువంటి చర్యలు సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని మాధవ్ ఆందోళన వ్యక్తం చేశారు. గ్యాస్ ఏజెన్సీలు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పారదర్శకంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే కొందరు వ్యాపార ప్రయోజనాల కోసం ప్రస్తుత పరిస్థితిని దుర్వినియోగం చేస్తూ కృత్రిమ కొరతను సృష్టించడం అత్యంత బాధాకరమని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత సరఫరా శాఖ అధికారులు వెంటనే స్పందించి గ్యాస్ ఏజెన్సీల పనితీరుపై సమగ్రంగా పరిశీలన చేయాలని మాధవ్ కోరారు.

కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్

అవసరమైతే ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, అక్రమాలకు పాల్పడుతున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గ్యాస్ సిలిండర్ల సరఫరా నిరంతరంగా కొనసాగేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. సామాన్య ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టి వినియోగదారుల హక్కులను పరిరక్షించాలని ఆయన విజప్తి చేశారు. అలాగే గ్యాస్ సరఫరా వ్యవస్థపై అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన పర్యవేక్షణ కొనసాగించాలని, అక్రమంగా ధరలు పెంచే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh AP BJP Gas Agencies gas Shortage Hardeep Singh Puri PVN Madhav

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.