విజయవాడ : రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా యుద్ధ ప్రాతిపదికన రహదారుల మరమ్మతుల పనులు చేపడుతున్నామని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ (B.C. Janardhan Reddy) తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో త్వరితగతిన రోడ్ల అభివృద్ధి పనులు పూర్తి చేసి, వెహికల్ మూమెంట్ లక్ష తీసుకురావడమే లక్ష్యంగా ఆర్ అండ్ బీ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్ అండ్ బి శాఖలో రహదారుల అభివృద్ధికి సంబంధించిన కాంట్రాక్ట్ పనులకు టెండర్లు పిలిచే క్రమంలో.. సాధారణంగా టెండర్లకు ఒకే బిడ్ వచ్చే సందర్భంలో.. తిరిగి టెండర్లు రీకాల్ చేయడం ఆనవాయితీ..
Read also: CBN: ఏపీలో కానిస్టేబుల్ నియామకాల్లో కీలక ముందడుగు
AP
అధ్వాన్నంగా మారిన రోడ్లతో
అయితే దీని కారణంగా తిరిగి మళ్లీ, మళ్లీ నూతనంగా టెండర్లు పిలవడం, సమర్పించడం.. వాటిని ఫైనల్ చేసి, ఒప్పందాలు పూర్తిచేసి పనులు చేపట్టడానికి దాదాపు 45 రోజులు పైగా బిడ్లు సమయం పడుతోంది. దీంతో పనులు సకాలంలో ప్రారంభం కాకపోవడంతో, అధ్వాన్నంగా మారిన రోడ్లతో ప్రజలు మరింత ఎక్కువకాలం ఇబ్బందులు పడే దారుణ పరిస్థితి నెలకొంటుంది. ఈ జాప్యాన్ని నివారించి, ప్రజా సౌకర్యార్థం, త్వరితగతిన రహదారుల మరమ్మతులు -అభివృద్ధి పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా.. ఆర్ అండ్ బీ శాఖలో తొలిసారి టెండర్లు పిలిచినప్పుడు, కేవలం ఒక్కరు మాత్రమే తీసుకుని, టెండర్ ఫైనల్ చేసి, పనులు కల్పిస్తూ, ఆర్ అండ్ బీ శాఖ నిర్ణయం వచ్చినప్పటికీ.. రీ కాల్కు ఆస్కారం లేకుండా.. దానిని పరిగణలోకి ప్రారంభించేందుకు వెసులుబాటు తీసుకుందన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: