📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Andhra Pradesh: జనావాసాలకు సురక్షిత మంచినీరు లక్ష్యం.. డి.సిఎం పవన్

Author Icon By Saritha
Updated: March 7, 2026 • 11:25 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Andhra Pradesh: జగన్ హయాంలో ఆర్ధిక విధ్వసం చేసి, ఏపీని గందరగోళంలోకి నెట్టివేశారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఆర్థిక విధ్వంసం వల్ల ఏపీ 30ఏళ్లు వెనక్కు వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ద్రవ్యవినిమయ బిల్లుపై పవన్ కల్యాణ్ అసెంబ్లీలో మాట్లాడారు. మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఐదుకోట్ల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా ఉందని వ్యాఖ్యానిం చారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా 3.32 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. సామాజిక భద్రత పెన్షన్ల కోసమే రూ.33వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. ఇలాంటి పరిస్థితిని తట్టుకోవటం, పథకాలు ఇవ్వటానికి సీఎం చంద్రబాబుకు ఎంతో ధైర్యం ఉండాలని ప్రశంసించారు.

Read Also: Manchu Manoj: సోషల్ మీడియా బ్యాన్: ఏపీ ప్రభుత్వంపై మంచు మనోజ్ ప్రశంసలు

Andhra Pradesh: Safe drinking water for the population is the goal.. DCM Pawan

చంద్రబాబు దార్శనికతపై ప్రశంసలు

నేను నాటిన చెట్ల ఫలాలు నా కోసం కాదని, భావితరాల కోసం అన్న రవీంద్రనాథ్ ఠాగూర్ సూక్తులను పవన్ కల్యాణ్ ప్రస్తావించారు. బడ్జెట్లో చంద్రబాబు దూరదృష్టి, దక్షత, దార్శనికత అడుగడుగునా ఉందని కొనియాడారు. వైసీపీ హయాంలో చేపట్టిన విద్యుత్ కొనుగోళ్ల కారణంగా డిస్కంలకు రూ.12,250కోట్ల నష్టం వచ్చిందని చెప్పుకొచ్చారు. కరెంట్ సరఫరాలో కూడా ఇబ్బందులు వచ్చాయని వివరించారు. రూ.1.29 లక్షల కోట్లు విద్యుత్ సంస్థలు నష్ట పోయాయని, ఆ భారాన్ని ప్రజలపై మోపారని ఆగ్రహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ట్రూఅప్ చార్జీలు రద్దు చేసి ట్రూడౌన్ పేరిట ఛార్జీలు తగ్గించామని ప్రస్తావించారు. వైసీపీ ప్రభుత్వం రూ.9లక్షల కోట్ల మేర అప్పులు తమపై ఉంచి వెళ్లిందని పవన్ కల్యాణ్ ధ్వజ మెత్తారు. రూ.35వేల కోట్ల బిల్లులను పెండిం గ్లో పెట్టి వెళ్లారని, అందులో రూ.25వేల కోట్లు చెల్లించామని స్పష్టం చేశారు.

మంచినీటి లక్ష్యం

కేంద్ర పథకాలకు రాష్ట్రవాటా రూ.7వేల కోట్లకు పైగా జత చేశామని వెల్లడించారు. గతంలో వైసీపీ రాష్ట్ర వాటా ఇవ్వకపోవటం వల్ల రూ.8,700 కోట్లు జలజీవన్ మిషన్ నిధులు నిరుపయోగమయ్యాయని చెప్పుకొచ్చారు. వైసీపీ పట్టించుకోకుండా నిరక్ష్యంగా వదిలేసిన అనేక ప్రాజెక్టులను కూటమి ప్రభుత్వంలో ప్రారంభిం చామని తెలిపారు. జలజీవన్ మిషన్కు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వినూ త్న కార్యక్రమాలు అమలు చేస్తున్నాం అన్నారు. జల్ జీవన్ మిషన్ పథకాన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. గుర్తించిన గ్రామాలకు ముందస్తుగా మంచినీటి సౌకర్యాలకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన నీరు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామ న్నారు. 3 వేల గ్రామాలకు స్వచ్ఛమైన నీరు అందించాలన్న బలమైన సంకల్పంతో ముందు కెళ్తున్నా అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి నేతలందరం ఐక్యంగా ముందుకెళ్లామని ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ వ్యాఖ్యానించా రు. కూటమి చాలా బలంగా ఉండాల నేది తన ఆకాంక్ష అని ఉద్ఘాటించారు. ఏపీ అభివృద్ధి కోసమే 2014లో అలయన్స్ కోసం కష్టపడ్డానని తెలిపారు. 2019లో అది సాధ్యం కాలేదని.. 2024లో మరోసారి వెనక్కు తగ్గి పొత్తు పెట్టుకున్నానని ప్రస్తావించారు.

మంచినీటి సమస్యను పరిష్కరిస్తాం

మూడువేల గ్రామాల్లో మంచినీటి సమస్య గుర్తించామని… అక్కడ తొలి ప్రాధాన్యంగా నీరు ఇస్తామని పవన్ స్పష్టంచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 48 వేల జనావాసాల్లో సురక్షిత మంచినీరు ఇవ్వాలనే లక్ష్యమని ఉద్ఘాటించారు. 2019 నుంచి 2024 మధ్య ఉపాధి హామీ పథకంలో రూ. 610కోట్లు రోడ్ల కోసం ఖర్చు చేశారని తెలి పారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.3.853కోట్లు రోడ్ల కోసం ఖర్చు చేశామని తెలిపారు. ఐదేళ్లలో 880 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేస్తే మనం 6 వేల కిలోమీటర్లు వేశామని వెల్లడించారు. వైసీపీ హయాంలో అన్ని రోడ్లు 8,500 కిలోమీటర్లు వేస్తే… మనం రెండేళ్లలో 17,500 కిలోమీటర్ల రోడ్లు వేశామని తెలిపారు. కష్టాలు, నష్టాలున్నా 11.75 ఆర్థిక వృద్ధిరేటు చూపించిన సీఎం చంద్రబాబుకు అభినందనలు. కోటి 11 లక్షల సివిల్ కేసులు, 3కోట్లకు పైగా క్రిమినల్ కేసులు దేశవ్యాప్తంగా పెండింగ్లో ఉన్నాయని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ చెప్పార ని అన్నారు. ఈ సమస్య పరిష్కరించాలని గవర్నర్ సూచించా రన్నారు. మన వద్ద ఉన్న కోర్టుల సంఖ్య, సిబ్బంది సంఖ్య ప్రకారం ఈ కేసులు ఎప్పటికీ పరిష్కారమవుతాయో చెప్పలే మని అన్నారు. బడ్జెట్లో 100 కోర్టు గదులకు నిధులు కేటాయించటం సంతోషమన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh assembly speech Deputy CM Pawan Kalyan Jal Jeevan Mission AP

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.