हिन्दी | Epaper
అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

News Telugu: Andhra Pradesh: గిరిజన ప్రాంతాల్లో 90 వైద్య పోస్టుల భర్తీ

Rajitha
News Telugu: Andhra Pradesh: గిరిజన ప్రాంతాల్లో 90 వైద్య పోస్టుల భర్తీ

అసెంబ్లీలో మంత్రి సత్యకుమార్ యాదవ్ విజయవాడ : గిరిజన ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో వైద్యుల పోస్టుల భర్తీకి అధిక ప్రాధాన్యతనిస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ Satyakumar Yadav వెల్లడించారు. Andhra Pradesh రాష్ట్ర శాసనసభలో మంగళవారం జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి మాట్లాడారు. “ఉద్యోగ, స్వచ్ఛంద ఉద్యోగ విరమణ లవల్ల వైద్యుల కొరత ఏర్పడుతుండగా వెంటనే భర్తీకి చర్యలు తీసుకుంటున్నాం. ప్రజారోగ్యమే లక్ష్యంగా వాక్ఇన్ ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తున్నాం. వదోన్నతులు కూడా చేబడుతున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన అనంతరం గిరిజన ప్రాంతాల్లోని 153 పిహెచ్సీలకు కలిపి 306 సివిల్ అసిస్టెంటు సర్జన్ పోస్టులు మంజూరయ్యాయి. ఇందులో ఖాళీగా ఉన్న 138కు 131 పోస్టుల (90 )ను గత 5 నెలల్లో భర్తీ చేశాం.

ప్రస్తుతం 31 పోస్టులు (10 ) ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకికూడా చర్యలు తీసుకుంటున్నాం. ప్రకాశంజిల్లా మార్కాపురం జిల్లా ఆసువత్రిని బోధనాసుపత్రిగా మార్చేందుకు గత వైఎస్సార్సీ ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో గందరగోళం నెలకొన్నందున వైద్యులు, మౌలిక సదుపాయాలకు కొరత ఏర్పడింది. నిర్మాణాలకు రూ.47 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టింది. 625 పడకలతో మార్కావురం వైద్య కళాశాలను పిపిపి విధానంలో నడపాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇన్ సర్వీస్ కోటా పిజి చేసేందుకు వెళ్లిన సుమారు 250 మంది వైద్యులు నవంబరులో రానున్నారు. వీరిని అవసరమైన ఆసుపత్రుల్లో నియమిస్తాం. కనిగిరి, కోవూరు, బుచ్చిరెడ్డిపాలెంలోని ఆసుప త్రుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం. గుండె పోటుతో బాధపడేవారికి స్పెషలిస్టు వైద్యులద్వారా స్టెమీ విధానంలో రూ.45 వేలు విలువచేసే ఉచిత ఇంజెక్షన్ చికిత్స అందిస్తున్నాం. స్టెమీ విధానంలో సుమారు 4వేల మంది రోగులు ప్రాణాపాయ పరిస్థితుల నుంచి కోలుకున్నారు. పీహెచ్సీ స్థాయిలో స్టెమీ విధానం అమలుకు స్పెషలిస్టు వైద్యుల అవసర ముంది.

Andhra Pradesh

Andhra Pradesh

మరణాలు 38.8 నుంచి 30కుతగ్గాయి

పిహెచ్సీల్లో వీరులేనందున అక్కడ స్టెమీ సౌకర్యాన్ని అందుబాటు లోనికి తీసుకురావడం కష్టమవుతుంది. కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల మాతృత్వ మరణాలు 38.8 నుంచి 30కుతగ్గాయి” అని మంత్రి వివరించారు. Andhra Pradesh జీఎస్టీ సంస్కరణలతో క్యాన్సర్ సహా వివిధ వ్యాధులకు సంబంధించిన అనేక ఔషధాల ధరలు తగ్గుతాయని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. బిజెపి ఎంఎల్ఎలు, MLA ఎంఎల్సీలు మీడియా పాయింట్లో విలేకరులతో మాట్లాడారు. ‘గతంలో ఉన్న నాలుగు శ్లాబుల్ని రెండు చేయడం వల్ల నిత్యావసర వస్తువుల మీద జీఎస్టీ బాగా తగ్గుతుంది. పేద, మధ్యతరగతి ప్రజలకు మేలు జరుగుతుంది. ఈ సారి ప్రజలకు దసరా, దీపావళి ముందే వచ్చాయి అని సత్యకుమార్ యాదవ్ అన్నారు. దేశానికి ఇది పండుగదినం అని బిజెపి BJP శాసనసభాపక్షనేత విష్ణుకుమార్రాజు అన్నారు. నిత్యావసర ధరల తగ్గిం పుతో మహిళలకు ఎంతో మేలు జరుగుతుందని ఆదోని ఎంఎల్ఎ పార్థసారథి పేర్కొన్నారు. ఈ సమావేశంలో బిజెపి ఎంఎల్ఎలు ఆదినారాయణరెడ్డి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఈశ్వరరావు, శాసనమండలి డిప్యూటీ స్పీకర్ జకీయా ఖానం, ఎంఎల్సీలు సోము వీర్రాజు, పోతుల సునీత తదితరులు పాల్గొన్నారు.

గిరిజన ప్రాంతాల్లో వైద్యుల పోస్టుల భర్తీపై మంత్రి సత్యకుమార్ యాదవ్ ఏమని చెప్పారు?
గిరిజన ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో వైద్యుల కొరతను తక్షణమే భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని, వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు.

ఇప్పటివరకు ఎన్ని పోస్టులు భర్తీ అయ్యాయి?
306 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు మంజూరయ్యాయి. వాటిలో ఖాళీగా ఉన్న 138 పోస్టులలో 131 పోస్టులు భర్తీ అయ్యాయి. అందులో 90 వైద్య పోస్టులు గిరిజన ప్రాంతాల్లో భర్తీ అయ్యాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870