ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌పై మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. బడ్జెట్ స్పీచ్‌లో అసత్యాలు చెప్పారని ఆయన ఆరోపించారు. ప్రజలను ఆకర్షించేందుకు ప్రకటించిన ‘సూపర్-6’ హామీలకు తగిన కేటాయింపులు లేవని విమర్శించారు. బడ్జెట్‌లో ఎలాంటి మార్పులు లేవు. గతేడాది బడ్జెట్ బుక్ చూసినట్లే ఉంది. ఊహాజనితమైన లెక్కలతో బడ్జెట్ రూపొందించారు. అసలు అప్పు ఎంత ఉందో చెప్పలేదు. ఏయే రంగాలకు ఎంత కేటాయించారో వెల్లడించలేదు’ అని వ్యాఖ్యానించారు.
Read Also: Andhra Pradesh: బడ్జెట్‌పై యనమల ప్రశంసలు
అప్పులపై శ్వేత పత్రం విడుదల చేయాలి
కాగ్ నివేదికల ప్రకారం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారలేదని, కేంద్రం కంటే ఆదాయ వృద్ధి ఎక్కువగా ఉందని చెప్పారు బుగ్గన……… జల జీవన్ మిషన్ కింద ఖర్చు చేసిన నిధులపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పులపై శ్వేత పత్రం విడుదల చేయాలని కోరారు.
నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్ సిలిండర్ వంటి హామీలకు తగిన కేటాయింపులు లేవని ఆరోపించారు. ఉద్యోగుల బకాయిలు రూ.40 వేల కోట్లకు చేరుకున్నాయని పేర్కొన్నారు. మొత్తం మీద ఈ బడ్జెట్ ప్రజాశ్రేయస్సుకు తోడ్పడేలా లేదని, ఇది “అనాలసిస్ ఆఫ్ బడ్జెట్” కంటే “అనాలసిస్ ఆఫ్ అబద్ధాలు”గా మారిందని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: