📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

Andhra Pradesh- President Droupadi Murmu: విశాఖకు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము

Author Icon By Aanusha
Updated: February 17, 2026 • 7:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Andhra Pradesh- President Droupadi Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విశాఖపట్నం చేరుకున్నారు. నౌకాదళ విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆమెకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి సాదరంగా స్వాగతం పలికారు. ఎంపీ శ్రీభరత్, మేయర్ పీలా శ్రీనివాస్, ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. (ఫిబ్రవరి 18) విశాఖ తీరంలో జరగనున్న ప్రతిష్ఠాత్మక ‘అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్ష-2026’కు రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

Read Also: agricultural: వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తున్న కేటాయింపులు

పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేశారు

భారత సాయుధ దళాల సుప్రీం కమాండర్‌గా ఆమె ఈ సమీక్షను పర్యవేక్షిస్తారు. ఈ కార్యక్రమంలో భారత నౌకాదళంతో పాటు పలు విదేశీ యుద్ధనౌకలు కూడా పాల్గొంటాయి.ఆమె పర్యటన నేపథ్యంలో విశాఖ నగరంలో పోలీసులు, నౌకాదళ అధికారులు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

Andhra Pradesh- President Droupadi Murmu: President Murmu arrives in Visakhapatnam

ఈ నేపథ్యంలో వివిధ దేశాల నౌకల రాక సైతం మొదలైంది. అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ, మిలన్ 2026, నేవీ చీఫ్​ల కాన్ క్లేవ్​కి విశాఖ నగరం వేదికైన తరుణంలో ఏర్పాట్లపై గత 3 నెలలుగా జిల్లా యంత్రాంగం పెద్ద కసరత్తే చేసింది. ఫిబ్రవరి 18న అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్ష (ఫ్లీట్ రివ్యూ-2026), 19న ఇంటర్నేషనల్ సిటీ పరేడ్, మిలన్​, 20న ‘ఐయాన్స్ కాన్​క్లేవ్ ఆఫ్ చీఫ్స్’ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.