📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

Andhra Pradesh Politics: మండలికి ఓకే, అసెంబ్లీకి ‘నో’

Author Icon By Rajitha
Updated: February 13, 2026 • 10:58 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విపక్ష హోదా ఇవ్వనందుకు వైసిపి నిరసన మండలిలో పోరాడుతాం: జగన్

విజయవాడ : శాసనసభలో వైసిపికి చట్టసభల నిబంధనలను అనుసరించి విపక్షహోదా ఇవ్వాల్సి ఉందని మాజీ సీఎం జగన్ (jagan) అన్నారు. ఇది రాజ్యాంగబద్దమైన అంశం కాబట్టి ఆ దిశలో ఆందోళన చేస్తున్నామన్నారు. అయితే ఈ విషయంపై ఎందుకు చట్టపరంగా వ్యవహరించాల్సిన వాళ్ళు, ఇతరులు మాట్లాడుతున్నారని ఆయన ప్రశ్నించారు. వ్యవస్థను నాశనం చేస్తున్నారు. ప్రశ్నించే అవకాశం లేకుండా సభలో మనకు విపక్ష హోదా ఇవ్వడం లేదన్నారు. ఏపీ అసెంబ్లీలో వైసీపీకి విపక్ష హోదా ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ.. ఈసారి బడ్జెట్ సమావేశాల్లోనూ గవర్నర్ ప్రసంగం సందర్భంగా అసెంబ్లీకి హాజరైన జగన్ మ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. బాయ్ కాట్ చేసి వెళ్లిపోయారు.

Read also: Nellore Gudur Teacher Attack: గూడూరు టీచర్‌పై దాడి..నిందితుడు అరెస్ట్!

OK for the council, ‘no’ for the assembly

మండలిలో గళమెత్తే వ్యూహం

అనంతరం అసెంబ్లీ బీఏసీ సమావేశానికి కూడా జగన్ హాజరు కాలేదు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో జగన్ భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై వారితో చర్చించారు. అనంతరం కీలక నిర్ణయం ప్రకటించారు. వైఎస్సార్సీపీకి విపక్ష పార్టీ హోదా ఇవ్వనందుకు నిరసనగా ఈసారి కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా దూరంగా ఉండాలని జగన్ నిర్ణయించారు. అయితే అసెంబ్లీలో మాత్రమే విపక్ష హోదా ఇవ్వడం లేదు కాబట్టి ఎప్పటిలాగే ఈసారి కూడా శాసనసభకు మాత్రమే ఎమ్మెల్యేలు హాజరుకాకూడదని నిర్ణయించారు. దీంతో మండలికి మాత్రం వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు హాజరుకాబోతున్నారు. ఈ సందర్భంగా శాసనమండలిలో గట్టిగా పోరాడాలని ఎమ్మెల్సీలకు జగన్ దిశానిర్దేశం చేశారు.

ప్రభుత్వంపై ఆరోపణలు

కూటమి ప్రభుత్వం స్కామ్లమయంగా మారిందని, ఎక్కడికక్కడ యథేచ్ఛగా దోపిడి చేస్తున్నారని జగన్ వారికి తెలిపారు. రూ.5 వేల కోట్ల విలువైన భూమి 54 ఎకరాలు గీతమ్ వర్సిటీకి ఇచ్చేశారని, ఏ ముఖ్యమంత్రీ తన సొంత బంధువులకు ఎవరూ ఇలా ఇచ్చుకోలేదన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కొత్త నినాదం వినిపిస్తోందని, అదే క్యాష్.. సూట్కేసు.. రాజేష్.. లోకేష్. అన్నారు. ఈ అంశాలన్నింటిపైనా సభలో గట్టిగా గొంతు వినిపించాలని ఎమ్మెల్సీలకు సూచించారు. కళ్లు మూసి తెరిచేలోపు మూడేళ్లు గడుస్తాయని, వచ్చేది మన ప్రభుత్వమేనన్నారు. ఇప్పుడు కష్టపడి పని చేస్తున్న వారందరికీ, తగిన గుర్తింపు ఉంటుందన్నారు. పనితీరు ఆధారంగా మీకు మీ పదవులు తిరిగి వస్తాయి కూడా అన్నారు. అలాగే ఇంతకన్నా మంచి పదవులు కూడా దక్కే అవకాశం మీకు ఉందన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

AP Assembly boycott latest news Opposition status issue Telugu News YS Jagan Mohan Reddy YSRCP protest

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.