📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

Andhra Pradesh politics: ఎమ్మెల్యేలతో మంత్రి లోకేష్ డిన్నర్ మీటింగ్ లు

Author Icon By Rajitha
Updated: February 13, 2026 • 12:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : పార్టీ బలోపేతం విషయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ (Nara lokesh) వినూత్న పంథా ఎంచుకున్నారు. పార్టీని గ్రౌండ్ లెవల్ నుంచి బలోపేతం చేసేందుకు సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ.. ఎమ్మెల్యేలు, క్యాడర్కు మరింత దగ్గరయ్యేలా డిన్నర్ మీటింగ్ లకు శ్రీకారం చుట్టారు. కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా.. ఆత్మీయ వాతావరణంలో ప్రతి రోజూ ఏడుగురు ఎమ్మెల్యేలతో భోజనం చేస్తూ..వారి మనోగతాలు తెలుసుకుంటున్నారు. ఈ నిర్ణయం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సహాన్ని నింపుతోంది. ఈ సమావేశాల్లో ప్రధానంగా నియోజకవర్గాల అభివృద్ధి, పెండింగ్లో ఉన్న సమస్యలపై ఎమ్మెల్యేలను ఆరా తీస్తున్నారు.

Read also: TTD: స్వామి వారికీ బ్యాటరీ వాహనాలు ఇచ్చి తన ఉదారతను చాటుకున్న భక్తుడు

Minister Lokesh’s dinner meetings with MLAs

కేవలం ఆఫీసు గోడల మధ్య కాకుండా, డైనింగ్ టేబుల్ పై సాగే చర్చల వల్ల

నారా లోకేష్. జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తూ, వారి వ్యక్తిగత యోగక్షేమాలతో పాటు స్థానిక పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. సమస్య ఏదైనా ఉంటే వెంటనే పరిష్కరించేలా అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. కేవలం ఆఫీసు గోడల మధ్య కాకుండా, డైనింగ్ టేబుల్పై సాగే చర్చల వల్ల ఎమ్మెల్యేలతో ఎమోషనల్ బాండింగ్ ఏర్పడుతుందని లోకేష్ భావిస్తున్నారు. మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిపై లోకేష్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. అనుభవం లేక కొంతమంది చేస్తున్న చిన్నపాటి పొరపాట్లను సరిదిద్దేందుకు ఈ వేదికను వాడుకుంటున్నారు. వార్నింగ్, గదమాయింపులు కాకుండా.. ఓ ఫ్రెండ్లో, ఓ మెంటార్ పాలనపై అవగాహన కల్పిస్తున్నారు.

యువ ఎమ్మెల్యేలకి మార్గదర్శకత్వం

హైకమాండ్, యువ ఎమ్మెల్యేలకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించి, వారిలో ఆత్మవిశ్వాసం పెంచడం ద్వారా పార్టీకి క్రమశిక్షణ కలిగిన నాయకత్వాన్ని అందించడమే ఈ సమావేశాల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. టెక్నాలజీని వాడుకుంటూ డాష్ బోర్డుల ద్వారా డెవలప్మెంట్ కాదు క్షేత్రస్థాయిలో మమేకమవ్వడం తన శైలి అని లోకేష్ నిరూపిస్తున్నారు. సీనియర్లకు సముచిత గౌరవం ఇస్తూనే, యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్న తీరు పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని కలిగిస్తోంది. ఈ డిన్నర్ మీటింగ్స్ ద్వారా ఆయన వేస్తున్న అడుగులు అటు పార్టీ ఐక్యతను, ఇటు ప్రభుత్వ పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh politics latest news MLA Meetings Nara Lokesh Party Strategy TDP Telugu News Vijayawada

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.