విజయవాడ: జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా(పీఎంశ్రీ) పథకాన్ని ఉపయోగించుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముందంజన నిలిచింది. ఏపీ విద్యాశాఖాధికారులు అందించిన సమాచారాన్ని అనుసరించి, దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధిక పాఠశాలలు ఎంపికైన మొదటి రాష్ట్రంగా ఏపీ (AP is the first state)నిలవగా జాతీయ స్థాయిలో ఉత్తరప్రదేశ్ తర్వాత మన రాష్ట్రం 2వ స్థానంలో నిలిచింది.
దేశవ్యాప్తంగా 14,500 పాఠశాలలను కేంద్రం ఎంపిక
ఇందులో భాగంగా ఎంపికైన ప్రభుత్వ పాఠశాలలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 14,500 పాఠశాలలను కేంద్రం ఎంపిక చేయగా రాష్ట్రం నుంచి 982 పాఠశాలలు ఉన్నాయి. కేంద్రీయ, నవోదయ విద్యాలయాలను మినహాయిస్తే మన రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు 935 ఈ పథకానికి ఎంపికయ్యాయి. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) 1,725 పాఠశాలలతో అత్యధికంగా ప్రయోజనం పొందిన రాష్ట్రంగా 1వ స్థానంలో ఉంది. ఈ ఏడాది 80 పాఠశాలలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. గ్రీన్ స్కూల్స్ గా అభివృద్ధి చేయడం, సౌర విద్యుత్తు ఉత్పత్తి, నీటి సంరక్షణ, వ్యర్థాల నిర్వహణ వంటి పర్యావరణ అనుకూల చర్యలను ప్రోత్సహిస్తున్నారు. పీఎంశ్రీ, ఆటిజం కేంద్రాలు, నో బ్యాగ్ డే, స్కౌట్స్, పర్సనలైజ్ అడాప్టివ్ లెర్నింగ్ లాంటి వాటితో ఏపీ విద్యా వ్యవస్థకు ప్రభుత్వం కొత్త నిర్దేశం చేస్తోందని ఎస్ఎస్ఏ ఎస్పీడీ బీ.శ్రీనివాసరావు చెప్పారు. ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ దిశగా రాష్ట్రం పయనిస్తోందని విద్యార్థుల సంపూర్ణ విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. మొబైల్ యాప్ ద్వారా నిధుల వినియోగం, పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. ప్రతి పాఠశాలకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా రూ.50 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు ఏటా పాఠశాల నిర్వహణ నిధులు అందిస్తున్నారు. పీఎంశ్రీ కింద ఈ ఏడాది రూ.494 కోట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. తాజాగా ఇచ్చిన 80 పాఠశాలలకు అదనంగా మరో రూ.87 కోట్లు విడుదల చేసింది. ఈ పాఠశాలల్లో మోలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
PM-SHRI పథకం అంటే ఏమిటి?
PM-SHRI అంటే “Pradhan Mantri Schools for Rising India”. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం, దీని ద్వారా దేశవ్యాప్తంగా మోడల్ స్కూల్స్‌గా ఎంపికైన ప్రభుత్వ పాఠశాలలకు ఆధునిక వసతులు, డిజిటల్ టెక్నాలజీ, స్మార్ట్ తరగతులు, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు వంటి సౌకర్యాలు కల్పించబడతాయి.
ఈ పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానం లో ఉంది?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశవ్యాప్తంగా మొదటి స్థానంలో నిలిచింది. ఈ పథకాన్ని అత్యుత్తమంగా అమలు చేస్తున్న రాష్ట్రంగా గుర్తింపు పొందింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: News telugu: Parthasaradi: 16 మాసాల వ్యవధిలోనే హామీలన్నింటిని అమలు చేస్తున్నాం: మంత్రి కొలుసు పార్ధసారధి