📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

Andhra Pradesh: భూమి లేని పేదలకు పింఛన్లు పంపిణి..

Author Icon By Anusha
Updated: July 13, 2025 • 4:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాజిక న్యాయం పరంగా మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిలో భూమి లేని పేద కుటుంబాలకు పింఛన్లు మళ్లీ మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం వేలాది కుటుంబాల్లో సంతోషాన్ని నింపింది. ఇప్పటికే ఈ విధానం అమల్లో ఉండగా తాజాగా మరో 1575 కుటుంబాలకు పింఛన్లు అందించనుంది. 2015లో ఇంటింటి సర్వే ద్వారా అమరావతి (Amaravathi) లో భూమి లేని పేదలకు పింఛన్లు మంజూరు చేశారు. అయితే వివిధ కారణాలతో ఈ 1575 కుటుంబాలకు పింఛన్ నిలిచిపోయింది. ఇటీవల జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో ఈ విషయంపై చర్చించారు. ఈ 1575 కుటుంబాలకు పింఛన్లు అందించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు.

పింఛన్ రూపంలో

ఆ నిర్ణయం ఆధారంగా ఆదివారం అమరావతిలో భూమి లేని 1575 కుటుంబాలకు పింఛన్లు మంజూరు చేయాలంటూ ఉత్తర్వులు విడుదల అయ్యాయి.మరోవైపు రాజధాని అమరావతి పరిధిలో ఉండే 29 గ్రామాలలో భూములు లేని పేదలకు 2014- 2015 నుంచి పింఛన్లు అందిస్తున్నారు. తొలుత నెలకు రూ.2500 పింఛన్ (Pension) రూపంలో అందించగా ఆ తర్వాత పింఛన్ మొత్తాన్ని రూ.5000లకు పెంచారు. అయితే గత ప్రభుత్వ హయాంలో వీరికి పింఛన్లు సరిగా పంపిణీ చేయలేదని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పింఛన్ల పంపిణీ కోసం నిధులు కూడా విడుదల చేసింది.

Andhra Pradesh: భూమి లేని పేదలకు పింఛన్లు పంపిణి..

భూములిచ్చిన రైతులకు

అమరావతిలో 19 వేలమంది వరకూ భూమిలేని పేదలకు పింఛన్లు అందిస్తున్నారు.ఇప్పుడు మరో 1575 కుటుంబాలకు అందించనుండటంతో ఈ సంఖ్య 20 వేలు దాటనుంది. మరోవైపు రాజధాని అమరావతి నిర్మాణానికి భూసమీకరణ (Land consolidation) సమయంలో భూములిచ్చిన రైతులకు కౌలు డబ్బులు, భూములు లేని పేదలకు పింఛన్లు అందిస్తామని అప్పట్లో టీడీపీ ప్రభుత్వం హమీ ఇచ్చింది. ఆ మేరకు కౌలు డబ్బులు, పింఛన్లు అందిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ ఎంత పంపిణి చేస్తారు?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఎన్టీఆర్ భరోసా పింఛన్ స్కీమ్’ కింద, లబ్ధిదారులకు ప్రతి నెలకు ₹4,000 చొప్పున పింఛన్ అందుతుంది. అయితే, వికలాంగులకు ₹6,000 పింఛన్ నెలకు మంజూరవుతుంది.

ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ స్కీమ్ ఎవరు ప్రారంభించారు?

ఆంధ్రప్రదేశ్‌లో వృద్ధాప్య పింఛన్ పథకాన్ని మొదటిగా ప్రారంభించిన వ్యక్తి డామోదరం సంజీవయ్య గారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Anam Ramanarayana Reddy: టీటీడీలో అన్యమత ఉద్యోగులున్నారు

Amaravati poor families Andhra Pradesh Government AP Cabinet Decisions Breaking News landless poor beneficiaries pension reinstatement Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.