Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్ శాఖతో పాటుగా అనేక ముఖ్యమైన గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రిగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారు. అయితే ఈ శాఖల పరిధిలో తాను చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యేలకు తెలియజేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఇందుకోసం ఆయా నియోజకవర్గాలలో తన శాఖల పరిధిలో చేసిన అభివృద్ధి పనుల వివరాలతో బుక్ లెట్ ముద్రించి.. అసెంబ్లీలో మంత్రులు, ఎమ్మెల్యేలకు అందించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఇందులో భాగంగా తొలి బుక్‌లెట్‌ను ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి అందజేశారు.
Read Also: CM Chandrababu: పిల్లల పెంపకానికి వెయ్యి రూపాయలు.. బాబు వరాలు
మంత్రులు, ఎమ్మెల్యేలందరికీ సమాచారం
అయ్యన్నపాత్రుడి నియోజకవర్గంలో పల్లెపండగ 1.0, పల్లెపండగ 2.0 కార్యక్రమాలు, సాస్కీ వంటి పథకాల ద్వారా గ్రామాల్లో చేపట్టిన రోడ్లు, గోకులాలు, ఫారం పాండ్స్ తదితర అభివృద్ధి పనుల వివరాలను బుక్ లెట్‌లో ముద్రించారు. అలాగే జల్ జీవన్ మిషన్ ద్వారా చేపట్టిన తాగునీటి పథకాలకు సంబంధించిన కార్యక్రమాల వివరాలు, 15వ ఆర్ధిక సంఘం నిధులు ఎంతమేరకు అందించారనే వివరాలను అందులో పొందుపరిచారు. మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా ఈ బుక్ లెట్లు అందించేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు. ఆ రకంగా తన మంత్రిత్వశాఖల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆయా ఎమ్మెల్యేలకు తెలియజేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: