📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Andhra Pradesh: ఇళ్ల స్థలాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం!

Author Icon By Anusha
Updated: July 20, 2025 • 4:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌లోని ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు శుభవార్త. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వేగంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో, ఇల్లు లేని అర్హులైన కుటుంబాలకు గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్లు, పట్టణాలలో రెండు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలను కేటాయించనున్నట్లు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.ఈ హామీని నెరవేర్చే దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తుండగా, తాజాగా శనివారం నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్ (Online application) ప్రక్రియ కూడా ప్రారంభమైంది. దీని ద్వారా మరింత మందికి ఈ అవకాశాన్ని అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది.దీంతో త్వరలోనే ఇళ్ల స్థలాల పంపిణీ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇళ్ల నిర్మాణాలు

మరోవైపు ప్రభుత్వం మంజూరు చేసే ఇళ్ల స్థలాల కోసం శనివారం నుంచి ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అర్హులై ఉండి ఇళ్ల స్థలాలు కావాల్సిన వారు తమ ఆధార్ కార్డు. రేషన్ కార్డు (Ration card) లతో పాటుగా పాస్‌పోర్టు సైజు ఫోటోతో గ్రామ సచివాలయాలను సంప్రదించాలి. సచివాలయ సిబ్బందికి ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు అందజేయాలని అధికారులు సూచిస్తున్నారు.గత ప్రభుత్వ హయాంలో పట్టణాలలో సెంటు, గ్రామాలలో సెంటున్నర చొప్పున ఇళ్ల స్థలాలు పంపిణీ చేసింది. అయితే చాలామంది పట్టాలు తీసుకున్నప్పటికీ అందులో ఇళ్ల నిర్మాణాలు జరపలేదు.ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నిరుపేదలకు పట్టణాలలో రెండు సెంట్లు, గ్రామాలలో మూడు సెంట్లు స్థలం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

Andhra Pradesh: ఇళ్ల స్థలాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం!

దరఖాస్తుల స్వీకరణ

గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలు పొంది ఇల్లు నిర్మించని వారికి కూడా ఈ పథకం వర్తింపజేయనున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఇళ్ల స్థలాల పంపిణీ కోసం భూములను సేకరించారు. అవసరమైతే ఆ భూములకు అదనంగా భూమిని సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తుల స్వీకరణ మొదలుకాగా, లబ్ధిదారులలో ఆనందం వ్యక్తమవుతోంది.మరోవైపు టిడ్కో ఇళ్ల (Tidco houses) లబ్ధిదారులకు కూడా వచ్చే సంక్రాంతి నాటికి టిడ్కో ఇళ్లు అందించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. సంక్రాంతి నాటికి ఇళ్లు పూర్తి చేసి గృహప్రవేశాలు చేయిస్తామని ఏపీ టిడ్కో కార్పొరేషన్ ఛైర్మన్ కూడా ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్‌కు ఏమి ప్రత్యేకత ఉంది?

ఆంధ్రప్రదేశ్‌ అనేది సాంస్కృతిక, భౌగోళిక, ఆధ్యాత్మిక పరంగా ఎంతో ప్రత్యేకత కలిగిన రాష్ట్రం.

ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత సంపన్నమైన నగరం ఏది?

ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం (Visakhapatnam)ను సాధారణంగా అత్యంత సంపన్న నగరంగా పరిగణిస్తారు. ఈ నగరం రాష్ట్రానికి ఆర్థికంగా చాలా ముఖ్యమైన హబ్‌గా పనిచేస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Andhra Pradesh: వినియోగదారులకు గుడ్‌న్యూస్.. ఇంటి నుంచే రిజిస్టర్ పోస్ట్ బుక్ చేయొచ్చు

andhra pradesh house site scheme AP poor housing scheme apply online for housing land in AP Breaking News latest news online application for house plot AP TDP housing promise Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.