📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

Andhra Pradesh: టెక్స్‌టైల్ రంగంలో తొమ్మిది కంపెనీలు

Author Icon By Tejaswini Y
Updated: November 6, 2025 • 11:23 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కంపెనీ ప్రతినిధులతో మంత్రి సవిత భేటీ

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలో జౌళి రంగానికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత వెల్లడించిన ప్రకారం, మొత్తం తొమ్మిది కంపెనీలు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న పార్టనర్‌షిప్ సదస్సు సందర్భంగా ఈ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనుందని ఆమె తెలిపారు. నిన్న రాష్ట్ర సచివాలయంలో తన ఛాంబర్‌లో కంపెనీల ప్రతినిధులతో మంత్రి సవిత సమావేశమయ్యారు. కొందరు నేరుగా పాల్గొనగా, మరికొందరు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.
మ్యాట్రెస్ తయారీ, అపెరల్ ప్రొడక్షన్, గార్మెంట్స్ తయారీ, పాలిస్టర్ వేడింగ్ యూనిట్లు వంటి విభాగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ఆసక్తి చూపాయి. ముఖ్యంగా ఈ సంస్థలు తమ పరిశ్రమలను రాయలసీమ ప్రాంతంలో స్థాపించాలన్న ఉత్సాహం వ్యక్తం చేశాయని మంత్రి వెల్లడించారు. పరిశ్రమల స్థాపనకు అనుకూల ప్రాంతాలపై తుది నిర్ణయం విశాఖ సదస్సులో తీసుకోనున్నట్లు తెలిపారు.

Read Also:  Thalaivar 173: రజనీ, కమల్ కాంబోలో సినిమా

నూతన టెక్స్‌టైల్ పాలసీకి పెట్టుబడిదారుల స్పందన

Andhra Pradesh: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త టెక్స్‌టైల్ పాలసీకి పారిశ్రామికవేత్తల నుంచి మంచి స్పందన వస్తోందని మంత్రి సవిత తెలిపారు. ఈ పాలసీ వల్లే అనేక సంస్థలు ఏపీలో పెట్టుబడులకు ముందుకొస్తున్నాయని ఆమె వివరించారు. రాబోయే కాలంలో మరిన్ని కంపెనీలు రాష్ట్రంలో తమ యూనిట్లను స్థాపిస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశానికి హాజరైన నలుగురు పెట్టుబడిదారులను మంత్రి సవిత సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్.పి. సిసోడియా, కమిషనర్ రేఖారాణి తదితరులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

AndhraPradesh APTextileIndustry CMChandrababuNaidu Investment PartnershipSummit RayalaseemaDevelopment SavithaMinister visakhapatnam

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.