📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఈ రోజు బంగారం ధరలు ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ స్పోర్ట్స్ కోటాలో 97 ఇన్‌కమ్ ట్యాక్స్ పోస్టులు కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఈ రోజు బంగారం ధరలు ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ స్పోర్ట్స్ కోటాలో 97 ఇన్‌కమ్ ట్యాక్స్ పోస్టులు కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్

Andhra Pradesh: ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు

Author Icon By Aanusha
Updated: January 6, 2026 • 8:47 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణపై అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఇంటర్మీడియట్ విద్యా మండలి నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రాక్టికల్స్ నిర్వహించే ప్రతి పరీక్షా కేంద్రంలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి రంజిత్ బాషా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Read also: AP: నేడు సచివాలయానికి డిప్యూటీ సీఎం పవన్

కొత్త మార్పులు

త్వరలో జరగనున్న పబ్లిక్‌ పరీక్షలు, ఇంటర్మీడియట్‌ విద్యలో అమలు చేస్తున్న కార్యక్రమాలపై రంజిత్ బాషా కీలకమైన సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు రెండు విడతలుగా జరిగే ఈ పరీక్షలను.. అలాగే ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు జరగనున్న పబ్లిక్ పరీక్షలను పర్యవేక్షించడానికి ఈ చర్యలు తీసుకుంటున్నారు. ప్రాక్టికల్ పరీక్షల కేంద్రాల్లో ఏర్పాటు చేసే సీసీ కెమెరాలను బోర్డులోని కార్యాలయానికి అనుసంధానం చేయాలని ఆదేశించారు. దీనివల్ల పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెరుగుతుందన్నారు.

Andhra Pradesh: New changes in intermediate examinations

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పబ్లిక్ పరీక్షల సమయంలో గుర్తించిన 45 సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేకంగా సిట్టింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేస్తారు. ఈ కేంద్రాలను రాష్ట్ర కార్యాలయం నుంచే సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తారు. ఈసారి ఇంటర్మీడియట్ మొదటి ఏడాది పరీక్షల్లో కొన్ని కొత్త మార్పులు ప్రవేశపెట్టారు. ఈ మార్పులను పరీక్షా కేంద్రాల సిబ్బంది, అధికారులు అందరూ క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా 45 సమస్యాత్మక కేంద్రాల్లో అదనపు నిఘా ఉంటుందని, రాష్ట్ర కార్యాలయం నుంచి సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తామని ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి రంజిత్ బాషా తెలిపారు. 

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Andhra Pradesh AP Inter Exams Intermediate Practical Exams latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.