📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Andhra Pradesh: మిల్లర్లపై మంత్రి నాదెండ్ల ఆగ్రహం

Author Icon By Rajitha
Updated: January 7, 2026 • 11:46 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బొండపల్లి (విజయనగరంజిల్లా) : జిల్లాలోని రైస్ మిల్లర్లపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన బొండపల్లిలోని లక్ష్మీనారాయణ మోడరన్ రైస్ మిల్లును సందర్శించారు. అనంతరం మిల్లర్ల అసోసియేషన్ నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ధాన్యాన్ని మర పట్టి ప్రభుత్వానికి అప్పగించడంలో తీవ్ర నిర్లక్ష్యాయాన్ని ప్రదర్శిస్తున్నారని మిలర్లపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. సీఎంఆర్ విషయంలో ఎందుకు వెనుకబడ్డారని నిలదీశారు. ఇప్పటికి కేవలం 17 శాతం మాత్రమే పూర్తి చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. బ్యాంకు గ్యారంటీల విషయంలో కూడా జిల్లాలోని మిల్లర్లకు వెసులుబాటు ఇచ్చామని, అయినప్పటికీ మిల్లింగ్ విషయంలో పెద్దగా శ్రద్ద చూపడం లేదని అన్నారు.

Read also: Tirumala: పరకామణి కేసులో ఊహించని పరిణామం!

Minister Nadendla expresses anger at the millers

రైతులకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తప్పవని

రోజుకి 150 ఏసికేల చొప్పున మిల్లింగ్ చేయాలని, ఈ నెల 8వ తేదిలోగా 45,000 మెట్రిక్ టన్నులు పూర్తి చేయాలని మిల్లర్లను మంత్రి ఆదేశించారు. గోదాములు, నిల్వ సమస్య రాకుండా చర్యలు తీసుకుంటామని, ఎఫ్సీ ఐ అంశాన్ని కూడా పరిష్కరించామని తెలిపారు. రైతులకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. క్యూ ఆర్ కోడ్ ప్రవేశపెట్టి దేశంలోనే మన రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. మంత్రి మనోహర్తో బాటు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎండి ఎస్. డిల్లీరావు, జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, ఎమ్మెల్యే లోకం నాగ మాధవి, డిసిఎంఎస్ చైర్మెన్ గొంప కృష్ణ, జెసి సేధు మాధవన్, ఇతర అధికారులు, కూటమి నాయకులు, మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు వెంకటరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

latest news Nadendla Manohar anger Rice millers issue AP Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.