📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Andhra Pradesh: శాసనసభలో నేటి నుంచి సరికొత్త టెక్నాలజీ

Author Icon By Tejaswini Y
Updated: February 12, 2026 • 11:05 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గురువారం నుంచి సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. ఇకపై సభ్యులు తమకు కేటాయించిన సీట్లలో కూర్చుంటేనే వారి హాజరు నమోదవుతుంది. ఈ మేరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత హాజరు విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు బుధవారం వెల్లడించారు. ఈ బడ్జెట్ సమావేశాల నుంచే ఈ విధానం అమల్లోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.

Read also: Andhra Pradesh: అంబటి రాంబాబుపై మరో పీటీ వారంట్‌

Latest technology in the Legislative Assembly from today

ఏఐ విధానం ద్వారా సభ్యుల హాజరు

అసెంబ్లీలో మీడియాతో మాట్లాడిన అయ్యన్నపాత్రుడు, ఇప్పటివరకు రిజిస్టర్లో సంతకాల ద్వారా హాజరు నమోదు చేసే పద్ధతికి స్వస్తి పలుకుతున్నట్లు తెలిపారు. నూతన ఏఐ విధానం ద్వారా సభ్యుల హాజరును మరింత కచ్చితంగా, పారదర్శకంగా నమోదు చేసేందుకు వీలు కలుగుతుందని వివరించారు. పెద్ద కార్పొరేట్ సంస్థల సీఈఓలు సైతం బయోమెట్రిక్ విధానాన్ని వాడుతున్నారని, పార్లమెంట్లోనూ ఇలాంటి టెక్నాలజీని తీసుకురావాలని యోచిస్తున్నారని ఆయన గుర్తుచేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

AI Attendance System AP Assembly News AP Budget Session 2026 Assembly Seating Attendance Assembly Speaker Ayyannapatrudu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.