📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం టీటీడీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేసారా? వాట్సాప్‌లో ‘పోలీస్ శాఖ సేవలు’ టెట్ ‘కీ’ విడుదల ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం టీటీడీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేసారా? వాట్సాప్‌లో ‘పోలీస్ శాఖ సేవలు’ టెట్ ‘కీ’ విడుదల ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది

Andhra Pradesh: రాష్ట్రంలో ఖాదీ క్లస్టర్లు: మంత్రి సవిత

Author Icon By Rajitha
Updated: December 23, 2025 • 11:25 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి


విజయవాడ : యువతకు ఉపాధి కల్పనలో ఆంధ్రప్రదేశ్ ఖాదీ, (khadi) విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు (ఏపీకేవీఐబీ) కీలక పాత్ర పోషిస్తోందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత కొనియాడారు. స్వయం ఉపాధి యూనిట్ల మంజజూరులో స్థానిక ప్రజాప్రతినిధులు, ఏపీ కేవీఐబీ అధికారులు సమన్వయంతో పనిచేసి, అర్హులైన నిరుద్యోగ యువతకు మేలు జరిగేలా చూడాలన్నారు. రాష్ట్రంలో ఖాదీ క్లస్టర్ల ఏర్పాటుకు కృషి వేయాలని మంత్రి ఆదేశించారు. తాడేపల్లిలో తన క్యాంపు కార్యాలయంలో ఏపీకేవీఐబీ సీఈవో జె. సింహాచలం, ఇతర అధికారులతో మంత్రి సవిత సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏడాదిలో ఏపీ కేవీఐబీ ఆధ్వర్యంలో ఏర్పాటైన యూనిట్ల వివరాలను మంత్రి సవితకు ఏపీకేవీఐబీ సీఈవో సింహాచలం వివరించారు.

Andhra Pradesh

లక్ష్యానికి మించి యూనిట్లు ఏర్పాటు చేయడం

202526లో కేంద్ర ప్రభుత్వం 1,060 యూనిట్ల ఏర్పాటుకు కూర్గెట్ పెట్టగా, లక్ష్యానికి మించి 3,595 యూనిట్లు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఈ యూనిట్ల ఏర్పాటుకు 39.20 కోట్లను మార్జిన్ మనీగా అందించామన్నారు. 3,595 యూనిట్లతో 39,545 మంది ఉపాధి పొందుతున్నారన్నారు. ప్రస్తుతం టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం వర్క్స్, కొవ్వొత్తుల తయారీ, ఆకులతో కప్పులు, ప్లేట్ల తయారీపై శిక్షణ అందజేస్తున్నామన్నారు. లక్ష్యానికి మించి యూనిట్లు ఏర్పాటు చేయడంపై ఏపీకేవిఐబీ సిబ్బందిని మంత్రి సవిత అభినందించారు. స్వయం ఉపాధి కల్పనలో భాగంగా ఏపీ కేవీఐబీ ఆధ్వర్యంలో ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రొగ్రామ్ (పీఎం ఈజీపీ) ద్వారా యూనిట్ల ఏర్పాటుపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలన్నారు.

ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను

స్థానిక ఎమ్మెల్యేలతో ఏపీకేవీఐబీ సిబ్బంది సమన్వయం చేసుకోవాలని, ఆయా యూనిట్ల ఏర్పాటుపై మీడియా సమావేశాలు, అవగాహన సదస్సులు నిర్వహించాలని మంత్రి సవిత ఆదేశించారు. యూనిట్ల ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాలపై ఆయా సమావేశాల్లో, సదస్సుల్లో వివరించాలన్నారు. సోషల్ మీడియాలోనూ స్వయం ఉపాధి పథకాల యూనిట్ల ఏర్పాటుపై ప్రచారం చేయాలన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దాలన్న సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉందన్నారు. ఇంతవరకూ యూనిట్ల లబ్దిదారులతో త్వరలో భారీ సమావేశం నిర్వహిద్దామన్నారు. లబ్దిదారులు ఏ మేరకు లబ్దిపొందారో ఆ సమావేశంలో చెప్పడం ద్వారా మరింత మంది యువత పీఎంఈజీపీ యూనిట్ల ఏర్పాటుకు ముందుకొచ్చే అవకాశముందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను వీలైనంత ఎక్కువగా వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని మంత్రి సవిత స్పష్టంచేశారు.

ఖాదీ క్లస్టర్ల ఏర్పాటుకు కృషి

రాష్ట్రంలో ఖాదీ క్లస్టర్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలని ఏపీకేవీఐబి సీఈవో సింహాచలాన్ని మంత్రి సవిత ఆదేశించారు. అవసర మైతే, తాను కూడా ఢిల్లీ వచ్చి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి, రాష్ట్రంలో ఖాదీ క్లస్టర్ల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడడంలో నిరక్ష్యం చూపొద్దన్నారు. ఈ సమావేశంలో ఏపీ ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు చైర్మన్ కేకే చౌదరి, బోర్డు సభ్యులు తిరు పతి కుమార్, సాంబశివరావు, శ్రీనివాసరావు, శిరీష్ దేవి, ఏపీకేవీఐబీ అధికారులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Khadi latest news PMEGP Self Employment Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.