📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Andhra Pradesh: రేషన్ కార్డు సేవల ఛార్జీల పెంపు

Author Icon By Anusha
Updated: March 8, 2026 • 11:34 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డుకు సంబంధించిన వివిధ సేవలపై యూజర్ ఛార్జీలను భారీగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న రుసుములను ఇప్పుడు సవరించారు. కొత్త రేషన్ కార్డు దరఖాస్తు నుంచి చిరునామా మార్పు వరకు అన్నింటికీ అదనపు భారం తప్పదు. ఈ నిర్ణయం వెంటనే అమలులోకి రానుంది.

Read Also: Women’s Day 2026: మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేశ్

పెరిగిన సేవల ధరలు

రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పుల కోసం ప్రభుత్వం లబ్దిదారులకు అవకాశం కల్పించింది. కాగా, వీరికి సంబంధించి రైస్ కార్డ్ దరఖాస్తు సేవ రుసుం (సర్వీస్ ఛార్జ్)లను పెంచింది. కొత్త రైస్ కార్డ్, డూప్లికేట్ రైస్ కార్డ్, రైస్ కార్డులో సభ్యుల చేర్పు, తొలగింపు, వివరాల సవరణ, చిరునామా మార్పుతో పాటు రైస్ కార్డ్ విభజన వంటి అన్ని సేవల దరఖాస్తు సేవా ఛార్జీలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రూ. 24 సేవా రుసుం కలిగిన సేవలు రూ.100కు పెంచారు.

Andhra Pradesh: Increase in charges for ration card services

అదే విధంగా రూ 48గా ఉన్న రైస్ కార్డ్ విభజన సేవ రూ.200కు పెరిగింది. ఇక.. మీసేవ, స్వర్ణ గ్రామ వార్డు కార్యాలయం, సిటిజన్ పోర్టల్, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా వివిధ రకాల రైస్ కార్డ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. రేషన్ కార్డు పోగొట్టుకున్న వారికి డూప్లికేట్ కార్డు పొందాలన్నా.. వివరాలు తప్పుగా ఉంటే సరి చేసుకునేందుకు.. అదే విధంగా ఉన్న సభ్యులను తొలిగించటం.. చిరునామా మార్పు.. కార్డు స్ప్లిట్ వంటి వాటి కోసం ఈ సర్వీసు ఛార్జీల్లో మార్పులు జరిగాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

AP Ration Card Service Fee Hike 2026 AP Rice Card Division Charges New Smart Ration Card AP Ration Card Corrections

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.