బాపట్ల జిల్లా చెరువుజమ్ములపాలెం గ్రామంలో చోటుచేసుకున్న హృదయ విదారక సంఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఆ అనుమానమే పెనుభూతమే పీడించింది. చివరకు భార్యపై పెట్రోల్ పోసి తగులపెట్టాడు.
ఘటన వివరాలు:
బాపట్ల (Bapatla) మండలం చెరువుజమ్ములపాలెంకు చెందిన హారీష్, సుభాషిణిలకు 2014లో వివాహమైంది. వీరికి ఇద్దరూ పిల్లలున్నారు. అయితే గత కొంతకాలంగా కాపురంలో కలహాలు మొదలయ్యాయి. తరుచూ గొడవపడుతుండేవారు. హరీష్ బందువులు సుభాషిణి ప్రవర్తన గురించి లేనిపోని మాటలు చెప్పారు. దీంతో ఆమెను అనుమానించడం మొదలు పెట్టాడు. అయితే సుభాషిణిది కూడా అదే గ్రామం కావడంతో ఆమె బంధువులు వచ్చి ఆమెను పుట్టింటింకి తీసుకెళ్తామని చెప్పారు. అయితే తనకు ఎటువంటి అనుమానం లేదని చెప్పాడు.
దీంతో హారీష్ మాటలు నమ్మిన సుభాషిణి బంధువులు ఆమెను భర్త ఇంట్లోనే ఉంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే అనుమానం మరింత ముదిరి.. ఆమెను చంపాలని ప్లాన్ వేశాడు. సోమవారం మధ్యాహ్నం పెట్రోల్ బంక్‌లో రెండు లీటర్ల పెట్రోల్ కొనుగోలు చేసి బైక్ లో పెట్టుకొని ఇంటికి తీసుకొచ్చాడు. వచ్చిన వెంటనే సుభాషిణిపై పెట్రోల్ పోసి తగులబెట్టాడు. ఆమె ఒక్కసారిగా కేకలు వేసుకుంటూ బయటకు పరుగెత్తింది. తనను రక్షించాలంటూ వేడుకుంది. అయితే మంటలు ఆర్పడానికి ప్రయత్నించిన వారిని కూడా హారీష్ బెదిరించాడు. ఆమె మంటల్లో కాలిపోతుండటాన్ని చూసిన తర్వాతే అక్కడ నుంచి వెళ్లిపోయాడు.
చివరి ప్రయాణం:
గాయాల పాలైన సుభాషిణిని మొదట స్థానిక ఆసుపత్రికి, తర్వాత గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే తీవ్రంగా కాలిన ఆమె మృతిచెందింది. ఆమె మరణంతో ఇద్దరు చిన్నపిల్లలు తల్లిని కోల్పోయారు. ఈ సంఘటన ఆమె బంధువులు, గ్రామస్థులను తీవ్రంగా కలచివేసింది. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
పోలీసుల దర్యాప్తు:
హారీష్ ను కఠినంగా శిక్షించాలంటూ సుభాషిణీ బంధువులు బాపట్లలో ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు హత్య కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలింపు మొదలు పెట్టారు.
Read also: PSR Anjaneyulu: ఆంజనేయులుకు హైకోర్టులో లభించని ఊరట
P. Krishnaiah: కొల్లేరు సరస్సును కాపాడుకుందాం..అదే మన నినాదం కావాలి