📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం టీటీడీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేసారా? వాట్సాప్‌లో ‘పోలీస్ శాఖ సేవలు’ ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం టీటీడీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేసారా? వాట్సాప్‌లో ‘పోలీస్ శాఖ సేవలు’

Andhra Pradesh: రాజంపేట జిల్లా కేంద్రం కోసం జాతీయ రహదారి దిగ్బంధం

Author Icon By Pooja
Updated: December 24, 2025 • 11:04 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాజంపేట : రాజంపేటను జిల్లా కేంద్రం(Andhra Pradesh) చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి కడప రాజంపేట, రైల్వే కోడూరు, నందలూరు లో జరిగిన బంద్ ఉధృతంగా మారింది. రాజంపేటలో జాతీయ రహదారిని జేఏసీ నేతలు దిగ్బంధం చేశారు. జాతీయ రహదారిపై బైఠాయించి రాకపోకలు అడ్డుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఉద్యమకారులకు నచ్చ చెప్పారు. రెండు గంటల తర్వాత రహదారిపై రాకపోకలు సాధ్యమయ్యాయి.

Read also: CM CBN: పల్లెవెలుగు నుంచి ఎక్స్‌ప్రెస్ వరకు ఎలక్ట్రిక్ బస్సులే..

రైల్వే కోడూరులో కడప రేణిగుంట జాతీయ రహదారి పై ఉద్యమకారులు టైర్లు కాల్చివేసి ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు మంగళవారం రాజంపేట, రైల్వే కోడూరు, నందలూరులో ప్రజలు బంద్ పాటించారు. ప్రజలు స్వచ్ఛతంగా సహకరించారు. వ్యాపారులు దుకాణాలు మూసివేసి ఉద్యమంలో పాల్గొన్నారు. తెల్లవారుజామున జేఏఎస్ నేతలు ఆర్టీసీ బస్టాండ్ వద్దకు వెళ్లి గేట్ ముందు బైఠాయించారు. బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. మరోవైపు రాజంపేట నియోజక వర్గ జనసేన నేత ఎల్లటూరి శ్రీనివాసరాజు, టిడిపి, బిజెపి, సిపిఐ, సిపిఎం నేతలు బందులో పాల్గొన్నారు.

ఆర్యవైశ్యులు బంద్ సందర్భంగా ర్యాలీ నిర్వహించి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రాజంపేట జిల్లా కేంద్రం(Andhra Pradesh) చేయాలని వినతిపత్రం అందజేశారు. మహిళలు ఉద్యమంలో మేము సైతం అంటూ రాజంపేట పాత బస్టాండ్ లో గొబ్బియలు పాడుతూ రాజంపేట జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్ చేశారు. నిరాహార దీక్షలో మహిళలు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా జేఏసీనేతలు మాట్లాడుతూ ఇకనైనా కూటమి ప్రభుత్వం స్పందించి రాజంపేట జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల మనోభావాలు గుర్తించి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజంపేట జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరారు.

రాజంపేట నేతలు బంద్ జెఎసి ్మనారాయణ,పూల భాస్కర్, ఎల్లటూరి శ్రీనివాసరాజు, పట్టుపోగుల ఆదినారాయణ, గీతాంజలి వెంకటరమణ. మహిళా నేతలు శ్రీలతవాణి వర్మ, రైల్వేకోడూరులో జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి తాతంశెట్టి శెట్టి నాగేంద్ర, హేమరాజు, రమేష్, పటాన్ మోలా డాక్టర్ సయ్యద్ లు పాల్గొన్నారు

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also:

Google News in Telugu Latest News in Telugu National Highway Blockade NH Protest Rajampet District Centre

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.