16,666 ఎకరాల భూసమీకరణ
Andhra Pradesh: అమరావతి రాజధాని పరిధిలో రెండో దశ భూసమీకరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి సంబంధించి రేపు అధికారిక నోటిఫికేషన్ జారీ కానుంది. పెదపరిమి, వడ్లమాను, వైకుంఠాపురం, హరిశ్చంద్రాపురం, పెదమద్దూరు, యండ్రాయి, కర్ణపూడి, లేమల్లె గ్రామాల్లో ఉన్న పట్టా భూములు, అసైన్డ్ భూములు కలిపి మొత్తం 16,666.57 ఎకరాలను సమీకరించనున్నారు. అదనంగా సుమారు 3,828.56 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Read also: Employment Guarantee Scheme: ‘ఉపాధి’కి దూరమవుతున్న కొత్త పథకం!
ఫిబ్రవరి 28లోపు అమరావతి ల్యాండ్ పూలింగ్
భూసమీకరణ ప్రక్రియను ఫిబ్రవరి 28 నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో అధికారులు కార్యాచరణ చేపట్టారు. భూములు ఇచ్చే రైతులకు ప్రతిఫలంగా ప్లాట్లు అభివృద్ధి చేసి అందించాలని, నిర్ణీత కాలంలో అది జరగకపోతే రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గత అనుభవాల నేపథ్యంలో అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి కావాలన్నదే తమ ప్రధాన ఆందోళనగా రైతులు పేర్కొంటున్నారు. అమరావతి(Amaravati) అభివృద్ధి వేగవంతం చేయడమే లక్ష్యంగా రెండో దశ ల్యాండ్ పూలింగ్ చేపట్టామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. భూసమీకరణ అనంతరం రాజధాని నిర్మాణ పనులు మరింత వేగంగా ముందుకు సాగుతాయని అధికారులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: