AP Ganeshutsav : ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) హరీష్ కుమార్ గుప్తా గారు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో గణేశ్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు AP Ganeshutsav బహిరంగ ప్రదేశాల్లో మండపాలు ఏర్పాటు చేయాలనుకుంటే, ganeshutsav.net పోర్టల్ ద్వారా పోలీస్ అనుమతి కోసం దరఖాస్తు చేయాలని సూచించారు.
పోలీసులు దరఖాస్తులను పరిశీలించి, ఉచితంగా సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అనుమతిని ఇస్తారు. ఉత్సవ కమిటీ సభ్యులు ఆన్‌లైన్‌లో అప్లై చేసి NOC పొందవచ్చు. సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్ మండపాలను పరిశీలించి, సక్రమంగా ఉన్నట్లు ధృవీకరించిన తర్వాత QR కోడ్‌తో NOC జారీ చేస్తారు అని ఆయన తెలిపారు.
ఈ ఆన్‌లైన్ సిస్టమ్‌ను శాంతియుతంగా, పారదర్శకంగా మరియు భద్రతగా ఉత్సవాలు జరగడానికి ఏర్పాటు చేశామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పేర్కొన్నారు.
Read also :