విజయవాడ: 4.2 లక్షల కోట్ల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి ఉద్దేశంగా ఏపీ (Andhra Pradesh)లో ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ పాలసీ రూప కల్పన చేశారు. ఇప్పటికే అమలులోకి వచ్చిన ఈ పాలసీకి సంబంధించి ఏపీ ఎలక్ట్రానిక్స్ మాన్యు ఫ్యాక్చరింగ్ పాలసీ 4.0,2024-29 మార్గదర్శ కాలను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకుని వచ్చింది. ఈ రంగంలో 10 బిలియన్ యూఎస్ డాలర్ల విలువైన పెట్టుబ డులు ఆకర్షించాలని నిర్ణయించారు. అన్ని కేట గిరీల ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ (Electronics Manufacturing) యూనిట్లకు వందశాతం స్టాంపు డ్యూటీ మినహాయింపు ఇచ్చారు. కల్పించిన ఉద్యోగాల ఆధారంగా ఒక్కో ఉద్యోగికి నెలకు 4 వేల నుంచి 6 వేల వరకూ ఐదేళ్ల పాటు ప్రోత్సాహకం ఇవ్వనున్నారు. అన్ని కేటగిరీల్లోని ఎలక్ట్రానిక్ పరిశ్రమలకు ఐదేళ్ల పాటు యూనిట్ విద్యుత్ను రూ.1కే సరఫరా చేయా లని నిర్ణయించారు.

కడప జిల్లాలో ఎలక్ట్రానిక్స్ తయారీ
కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ మంజూరు చేసిన ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టరు కడప (Kadapa) జిల్లా కొప్పర్తిలో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వైఎస్ఆర్ ఈఎంసీగా దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 380.5కోట్ల రూపాయలను బుధవా రం మం జూరుచేసింది. ఈ క్లస్టర్ ఏర్పాటు కోసం కేంద్ర ఐటీశాఖ ఇప్పటికే అనుమతులు మంజూరు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తం గా ఈ క్లస్టర్ను ఏర్పాటు చేయను న్నాయి. అలాగే కొప్పర్తిలోని ఎలక్ట్రానిక్స్ మాన్యు ఫాక్చరింగ్ క్లస్టర్కు పెట్టుబడులు ఆహ్వానించేలా ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. గ్రీన్ కేటగిరీ లోని ఎలక్ట్రానిక్ పరిశ్రమలకు తనిఖీలు ఉండవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆరెంజ్, రెడ్ కేట గిరికి ఇది వర్తించదని పరిశ్రమల శాఖ వెల్లడిం చింది. భూమి లీజును 33 ఏళ్ల నుంచి 99 ఏళ్లకు పొడిగించుకునే అవకాశం కల్పించటంతో పాటు అవసరమైతే భూమిని కొనుగోలు చేసేం దుకూ వీలుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. మరో వైపు వందశాతం స్టాంపు డ్యూటీ రీయింబర్స్ మెంట్ కల్పించాలని నిర్ణయించినట్టు ప్రభుత్వం తెలిపింది. 20 శాతం మేర పెట్టుబడి రాయితీ కూడా ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ లో ఉంటుందని స్పష్టం చేసింది. 250 కోట్లకు మించి పెట్టుబడులు పెట్టే మొబైల్ ఉత్పత్తి పరిశ్రమలకు మెగా స్టేటస్ ఇస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఏపీ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ పాలసీ పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలువిశాఖ, తిరుపతి, నెల్లూరు, కడప, అనంతపురంలలో ఎలక్ట్రానిక్ మాన్యు ఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ఉత్పత్తికి అనువుగా ఉన్నట్టు అధికారులు స్పష్టం చేశారు. నైపుణ్యమున్న మానవ వనరులు, అనుకూల మైన ప్రభుత్వ విధానాలు ఈ రంగంలో పెట్టు బడులకు అనుకూలమని వెల్లడించారు. ఏపీలోని లాజిస్టిక్స్ నెట్వర్క్ తో పాటు విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అనువుగా ఉన్నట్టు తెలిపారు. ఈ రంగంలో వచ్చే పెట్టుబడులు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను ఆకర్షించ నున్నట్టు ప్రభుత్వం తెలిపింది. కేటగిరీల వారీగా ఈ రంగంలో పెట్టుబడుల ఆధారంగా ప్రోత్సా పాకాలు ప్రకటిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి .
Read hindi news: hindi.vaartha.com
Read also: District Collector Lakshmisha: కృష్ణమ్మ తీరాన కుంచెతో కోటి భావాలు