📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం

Andhra Pradesh: కొండెక్కిన కోడిగుడ్డు ధరలు!

Author Icon By Rajitha
Updated: December 21, 2025 • 11:34 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సామాన్యుడి పౌష్టికాహారంలో కీలకమైన కోడిగుడ్డు ధరలు ప్రస్తుతం రికార్డు స్థాయికి చేరాయి. పౌల్ట్రీ చరిత్రలోనే తొలిసారిగా గుడ్డు ధరలు ఇంత ఎత్తుకు చేరడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది నెలల క్రితం వరకు రిటైల్ మార్కెట్లో రూ.5 నుంచి రూ.6 వరకు ఉన్న ఒక్కో గుడ్డు ధర, ఇప్పుడు రూ.8కు చేరింది. హోల్‌సేల్ మార్కెట్లో కూడా ఒక్కో గుడ్డు ధర రూ.7.30కు పైగా పలుకుతుండటం పరిస్థితి తీవ్రతను స్పష్టంగా చూపిస్తోంది.

Read also: Tracking Device : లారీలకు ట్రాకింగ్ పరికరం తప్పనిసరి

Egg prices have skyrocketed

తగిన స్థాయిలో ఉత్పత్తి లేకపోవడమే

ఇటీవల వరకు రూ.160 నుంచి రూ.170 మధ్య ఉన్న 30 గుడ్ల ట్రే ధర, ప్రస్తుతం హోల్‌సేల్‌లోనే రూ.210 నుంచి రూ.220 వరకు పెరిగింది. మరోవైపు నాటు కోడిగుడ్లు ఒక్కొక్కటి రూ.15 వరకు విక్రయిస్తున్నారు. డిమాండ్‌కు తగిన స్థాయిలో ఉత్పత్తి లేకపోవడమే ఈ అకస్మాత్తు ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని పౌల్ట్రీ రంగ వర్గాలు చెబుతున్నాయి. దీంతో సామాన్య కుటుంబాల నెలవారీ ఖర్చుపై అదనపు భారం పడుతోంది.

గతంలో తెలుగు రాష్ట్రాల్లో రోజుకు సుమారు 8 కోట్ల గుడ్ల ఉత్పత్తి జరిగేది. అయితే కోళ్ల దాణా, మక్కజొన్న, చేపపొట్టు వంటి ముడిసరుకుల ధరలు భారీగా పెరగడంతో అనేక మంది రైతులు ఫారాల నిర్వహణను నిలిపివేశారు. దీని ప్రభావంగా గుడ్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం ఉన్న ధరలు పౌల్ట్రీ చరిత్రలోనే ఆల్‌టైమ్ గరిష్ఠమని వ్యాపారులు చెబుతున్నారు. ఉత్పత్తి సాధారణ స్థాయికి వచ్చే వరకు మరో రెండు నెలల పాటు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

egg price hike latest news poultry industry Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.