ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న విచారణకు రావాలని అందులో పేర్కొంది. కాగా ఇప్పటికే ఆ పార్టీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఈ నెల 22న విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని నిబంధనలకు విరుద్ధంగా మళ్లించారనే ఆరోపణలపై ఈడీ విచారణ జరుపుతోంది.
Read Also: Global Investment:దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
ఈడీ దూకుడు
ఇదివరకే ఈ కేసులో నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డిని సిట్ అరెస్టు చేయగా, రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా కొంతకాలం ఉన్నారు. అనంతరం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన విడుదలయ్యారు. వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని 22వ తేదీన విచారణకు రావాలని కోరిన ఈడీ, ఆ మరుసటి రోజే మిథున్ రెడ్డి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: