📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Andhra Pradesh: ఏపీలో క్రూడాయిల్‌ నిక్షేపాలు.. నాలుగు జిల్లాల్లో సర్వే

Author Icon By Saritha
Updated: March 18, 2026 • 1:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Andhra Pradesh: ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ప్రభావంతో గ్యాస్, పెట్రోల్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మనం కూడా వీటి కోసం విదేశాలపై అధారపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అక్కడెక్కడో యుద్ధం జరిగితే.. మన దేశంలో, మన రాష్ట్రంలో సమస్యలు తప్పడం లేదు. అందుకే కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.. దేశవ్యాప్తంగా సహజవాయు నిక్షేపాలను సద్వినియోగం చేసుకోవడంపై ఫోకస్ పెట్టింది. మిషన్‌ అన్వేషణ్‌ పేరుతో క్రూడాయిల్‌ నిక్షేపాల వేట మొదలుపెట్టింది. ఆంధ్రప్రదేశ్‌లో కడా మిషన్ అన్వేషన్ పేరుతో సహజవాయు నిక్షేపాల కోసం సర్వే చేస్తున్నారు.

ఏపీలోని విజయనగరం జిల్లా భోగాపురం నుంచి కాకినాడ జిల్లా పెద్దపురం వరకు.. మళ్లీ అక్కడి నుంచి కృష్ణా జిల్లా మచిలీపట్నం వరకు మిషన్ అన్వేషన్‌లో భాగంగా తొలి విడతలో సర్వే చేపట్టారు. ఈ సర్వేను ఓఎన్‌జీసీ, ఆల్ఫా జియో సంస్థ కలిసి ఉమ్మడిగా చేస్తున్నాయి. శాటిలైట్ ద్వారా సర్వే చేయాల్సిన ప్రాంతాలను గుర్తించారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో సర్వే కొనసాగుతోంది. అనకాపల్లి జిల్లాలో మండలాల్లో సర్వే చేస్తున్నారు.. సహజవాయు నిక్షేపాలను గుర్తించేందుకు నక్కపల్లి, పాయకరావుపేట, ఎస్‌.రాయవరం, రాంబిల్లి, మునగపాక మండలాల్లోని పంట భూముల్లో 60 అడుగుల లోతులో డ్రిల్లింగ్‌ చేస్తున్నారు.

Read Also: YS Sharmila: జిందాల్ భూ వంచనపై షర్మిల ఆగ్రహం

Andhra Pradesh: Crude oil deposits in AP.. Survey in four districts

డ్రిల్లింగ్ ప్రక్రియ, శాంపిల్స్ సేకరణ

ఈ భూముల్లో డ్రిల్లింగ్ చేసి.. మొదటి పది అడుగుల్లో వారికి అవసరమైన మట్టి నమూనాన సేకరిస్తున్నారు. అలాగే నీటి లభ్యత, సహజ వాయు నిక్షేపాలకు సంబంధించి అవసరమైన మరికొన్ని పరీక్షలు కూడా నిర్వహిస్తారు. ముందుగా 2డీ సెస్మిక్‌ సర్వేలో భాగంగా కేబుళ్లు ఏర్పాటు చేశారు. ఇలా డ్రిల్లింగ్‌ చేసి భూమి నుంచి సేకరించిన మట్టికి సంబంధించిన శాంపిల్స్‌ను డెహ్రాడూన్‌కు పంపించారు. మరికొన్ని శాంపిల్స్‌ను ఓఎన్‌జీసీ ల్యాబ్స్‌కు పంపించారు. ప్రస్తుతం ప్రాథమికంగా సర్వే చేస్తుండగా ఆ తర్వాత మరో రెండు విడతలుగా డ్రిల్లింగ్‌ చేపట్టునున్నారు. ఒకవేళ ఈ సర్వేలో ఎక్కడైనా సహజవాయు నిక్షేపాలను గుర్తిస్తే ఆ సమీపంలో రెండు ఎకరాల భూమిని లీజు కింద తీసుకుంటారు. మిషన్‌ అన్వేషణ్‌ పేరుతో చేపట్టిన ఈ సర్వేను వచ్చే నాలుగేళ్లలో పూర్తి చేయాలని ప్లాన్ చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Crude oil exploration Andhra Pradesh Latest News in Telugu Mission Anveshan Natural gas deposits Vizianagaram ONGC survey AP Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.