Andhra Pradesh Crime: అనుమానాస్పద స్థితిలో ఏఎస్ఐ మృతి.. సస్పెన్షన్ వేటే కారణమా?

Read Time:  1 min
Andhra Pradesh Crime: అనుమానాస్పద స్థితిలో ఏఎస్ఐ మృతి.. సస్పెన్షన్ వేటే కారణమా?
FONT SIZE
GET APP

Andhra Pradesh Crime: కృష్ణా జిల్లా యనమలకుదురు గ్రామంలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. విజయవాడ పటమట పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న వీరవల్లి గోపి వెంకట దుర్గాప్రసాద్ (54) మృతదేహం కరకట్ట శివారులోని ఒక పాకలో లభ్యమైంది.

Read Also: Divyanga Shakti Scheme: దివ్యాంగ శక్తి పథకం ప్రారంభించిన చంద్రబాబు, పవన్, లోకేష్

Andhra Pradesh Crime: అనుమానాస్పద స్థితిలో ఏఎస్ఐ మృతి.. సస్పెన్షన్ వేటే కారణమా?
Andhra Pradesh Crime: ASI dies under suspicious circumstances.. Is suspension the reason?

ఒక కేసు విషయంలో 15 రోజుల క్రితమే సస్పెన్షన్‌కు గురయ్యారు. విధులకు దూరం కావడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి లోనయ్యారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన మృతదేహం నిర్జన ప్రదేశంలో కనిపించడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పెనమలూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

దుర్గాప్రసాద్ మృతిపై ఆయన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇది ఆత్మహత్యా? లేక ఎవరైనా హతమార్చారా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.