ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. ఇవాళ ఉదయం 10.40 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఇద్దరు నేతల భేటీ కొనసాగనుంది. తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో గత నాలుగు రోజులుగా వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. ఇప్పటివరకు ఈ అంశంపై టీడీపీ మాత్రమే ప్రత్యక్షంగా దూకుడుగా స్పందిస్తుండగా,
Read Also: Rajamahendravaram tiger news : రాజమండ్రిలో పెద్దపులి కలకలం, స్కూల్ పక్కనే సంచారం! ప్రజల్లో భయం
పలు విషయాల పై చర్చ
ఇకపై కూటమి మొత్తం కలిసి ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా జనసేన కూడా ఈ అంశంలో మరింత యాక్టివ్‌గా పాల్గొనే దిశగా వ్యూహరచన జరిగే అవకాశముంది. అదే సమయంలో త్వరలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్న నేపథ్యంలో వాటి పంపకం అంశంపైనా ఈ సమావేశంలో చర్చ జరగొచ్చని తెలుస్తోంది. కూటమి సమీకరణాల ప్రకారం టీడీపీకి రెండు స్థానాలు, జనసేనకు ఒకటి, బీజేపీకి ఒకటి దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కూటమిలో సమన్వయం, అభ్యర్థుల ఎంపికపై కీలక చర్చ జరిగే అవకాశముందని సమాచారం.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: